E-Paper
Advertisement

Viveka Murder Case : అందుకే వివేకాను హత్య చేశారా..? భాస్కర్ రెడ్డి సూత్రధారా..? ఆ పెద్దల పాత్ర ఉందా..?

Viveka Murder Case : అందుకే వివేకాను హత్య చేశారా..? భాస్కర్ రెడ్డి సూత్రధారా..? ఆ పెద్దల పాత్ర ఉందా..?
Advertisement

Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా సాగుతోంది. వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్‌ చేయడంతో ఈ కేసులో ఉత్కంఠ మరింత పెరిగింది. వివేకా హత్యలో ఆయన పాత్ర ఉన్నట్లు సీబీఐ భావిస్తోంది. భాస్కర్‌రెడ్డిపై సీబీఐ పలు అభియోగాలు, ఆరోపణలు నమోదు చేసింది.

వివేకా హత్య జరిగిన రోజు అంటే 2019 మార్చి 15న తొలుత గుండెపోటుగా ప్రచారం చేయడం, సాక్ష్యాలు చెరిపివేయడంలో భాస్కర్‌రెడ్డి పాత్ర ఉన్నట్లు సీబీఐ భావిస్తోంది. ఈ కేసులో ప్రధాన కుట్రదారుడిగా ఆయనను పేర్కొంది. హత్యకు ముందురోజు అంటే 2019 మార్చి 14న సాయంత్రం 6.14 గంటల నుంచి 6.31 గంటల వరకు నిందితుడు సునీల్‌ యాదవ్‌.. భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్లు ఆధారాలు సేకరించింది. గూగుల్‌ టేక్‌ అవుట్‌ ద్వారా అతడిని గుర్తించినట్లు సీబీఐ తెలిపింది.

Advertisement

మరో నిందితుడు దస్తగిరి కదిరి వెళ్లి గొడ్డలి తెచ్చే వరకు భాస్కర్‌రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్‌ వేచి చూశారని సీబీఐ పేర్కొంది. ఆ సమయంలో తన రెండు ఫోన్లను భాస్కర్‌రెడ్డి స్విచ్ఛాఫ్‌ చేశారని తేల్చింది. వివేకానందరెడ్డి 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడానికి భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత భాస్కర్‌రెడ్డి ఇంటికి వివేకా వెళ్లారని.. తండ్రీకొడుకులతోపాటు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సీబీఐ నిర్ధారించింది. వివేకా వైసీపీలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భాస్కర్‌రెడ్డి భావించారని అందుకే అడ్డుతొలగించుకునేందుకే శివశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేయించి ఉంటారని సీబీఐ అనుమానిస్తోంది. ఈ అభియోగాల నేపథ్యంలో భాస్కర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.

వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్‌ చేయడంపై టీడీపీ నేత బీటెక్‌ రవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి చిన్న చేపలు మాత్రమేనని.. తాడేపల్లి ప్యాలెస్‌లో పెద్ద చేపలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత చేస్తున్న పోరాటానికి కొంత న్యాయం జరిగినట్లు అనిపించిందని తెలిపారు.

Advertisement

టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు వివేకా హత్య వెనుక ఇంకా ఎవరైనా పెద్దల హస్తం ఉందా..? సీబీఐ నెక్ట్స్ టార్గెట్ ఎవరు? ఈ కేసులో ఇంకా ఎలాంటి సంచలనాలు చోటుచేసుకుంటాయి..? ఇలాంటి అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×