E-Paper
Advertisement

Bhanu Prakash: తిరుమల చుట్టూ రాజకీయం చేస్తే వినాశనం తప్పదు.. వైసీపీ నేతలకు భాను ప్రకాష్ రెడ్డి హెచ్చరిక!

Bhanu Prakash: తిరుమల చుట్టూ రాజకీయం చేస్తే వినాశనం తప్పదు.. వైసీపీ నేతలకు భాను ప్రకాష్ రెడ్డి హెచ్చరిక!
Advertisement

Bhanu Prakash: హిందువుల ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుమల క్షేత్రాన్ని వైసీపీ నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడంపై టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ‘వైసిపి నాయకులకు ఒకటే చెబుతున్న తిరుమల చుట్టూ గిరిప్రదక్షిణ చేయండి పుణ్యం వస్తుంది.. తిరుమల చుట్టూ రాజకీయం చేస్తే రాజకీయ వినాశనం తప్పదన్నారు’. ఇప్పటికే ఏపీ ప్రజలు వైసీపీని కేవలం 11 స్థానాలకే పరిమితం చేసి బుద్ధి చెప్పారని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో గోశాలల నిర్వహణ నుండి గోవిందుడి దర్శనం వరకు ప్రతి విషయంలోనూ అపచారాలు జరిగాయని, స్వామివారి లడ్డూ ప్రసాదంలో వాడింది కల్తీ నెయ్యి అని సిట్ నివేదిక స్పష్టం చేసిందని ఆయన పేర్కొన్నారు.

కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉందని.. దీనిపై సిట్ జరిపిన విచారణలో కోట్ల రూపాయల హవాలా లావాదేవీలు వెలుగులోకి వచ్చాయని ఆయన వెల్లడించారు. అప్పన్న అనే వ్యక్తి ఖాతాలోకి 4 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. అసలు ఆవులే లేని ‘డోలే బాబా’ వంటి కంపెనీల నుండి నెయ్యిని ఎలా సేకరించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2019-2024 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల పాలు చేయడమే కాకుండా.. హిందూ వ్యతిరేక పాలన సాగించారని ఆయన ఆరోపించారు.

Advertisement

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేక జగన్ మోహన్ రెడ్డి, ఇతర వైసీపీ నేతలు రాష్ట్రపతి పాలన కావాలని కోరడం హాస్యాస్పదమని ఆయన కొట్టిపారేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలన్నీ తాడేపల్లి నుండి వస్తున్న ఆదేశాల మేరకు జరుగుతున్న ప్రీ-ప్లాన్డ్ స్కెచ్ అని ఆయన విమర్శించారు. వైసీపీ నేతలు నోటిదూలతో కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని.. చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2019 నుండి జరిగిన అపచారాలపై చర్చకు తాము సిద్ధమని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.

Also Read:  ఆ ఫోటోలు ఎంత పని చేశాయి.. తట్టుకోలేక ఆ వ్యక్తి ఏం చేశాడంటే

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×