E-Paper
Advertisement

Bear Attacks: రైల్వేకోడూరులో ఎలుగుబంట్ల బీభత్సం.. జనంపై దాడులు.. ప్రాణభయంతో వణుకుతున్న గ్రామాలు!

Bear Attacks: రైల్వేకోడూరులో ఎలుగుబంట్ల బీభత్సం.. జనంపై దాడులు.. ప్రాణభయంతో వణుకుతున్న గ్రామాలు!
Advertisement

Bear Attacks: కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో గత వారం రోజులుగా ఎలుగుబంట్ల సంచారం స్థానిక ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా ఓబులవారిపల్లె, రైల్వేకోడూరు మండలాల్లో రెండు ఎలుగుబంట్లు తిరుగుతూ జనాలపై దాడులకు తెగబడుతుండటంతో అటవీ ప్రాంత గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

వారం రోజుల క్రితం వై.కోట, బాల్రెడ్డిపల్లె గ్రామాల్లో ఎలుగుబంట్లు మొదటిసారిగా ప్రత్యక్షమయ్యాయి. ఈ క్రమంలో బాల్రెడ్డిపల్లెకు చెందిన అమర్నాథ్ రెడ్డి అనే యువకుడిపై ఒక ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన తర్వాత అవి శేషాచలం అడవుల్లోకి వెళ్ళిపోయాయని భావించినప్పటికీ.. తాజాగా సోమవారం సాయంత్రం మళ్ళీ వై.కోట గ్రామ సమీపంలోని మామిడి తోటల్లో రైతులకు దర్శనమిచ్చాయి. అక్కడ పని చేసుకుంటున్న రైతులపై దాడికి ప్రయత్నించడంతో వారు ప్రాణభయంతో పరుగులు తీశారు.

Advertisement

వరుసగా దాడులు జరుగుతున్నా.. అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. వేసవి కాలం కావడంతో నీటి కోసం జంతువులు అడవి నుంచి గ్రామాల్లోకి వస్తాయని.. జాగ్రత్తగా ఉండాలని అధికారులు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అధికారులు ఆయా గ్రామాలను సందర్శించి ఎలుగుబంట్లను బంధించేందుకు ఎటువంటి బోన్లు గానీ, నిఘా ఏర్పాటు గానీ చేయలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం తోటల్లో పనులు జరుగుతున్న సమయం కావడంతో.. ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలుగుబంట్లు వస్తాయో తెలియక ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఆ క్రూర మృగాలను అడవిలోకి పంపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Also Read: కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి ‘షాక్’.. పార్టీలో కొనసాగడంపై పునరాలోచన.. ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×