E-Paper
Advertisement

ఘోరంగా ఓడినా.. సైకోకు బుద్ధి రాలేదు.. జగన్‌పై విరుచుకుపడ్డ మంత్రి

ఘోరంగా ఓడినా.. సైకోకు బుద్ధి రాలేదు.. జగన్‌పై విరుచుకుపడ్డ మంత్రి
Advertisement

B. C. Janardhan Reddy: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమరావతిపై జగన్ వ్యవహరిస్తున్న ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఓడిపాయినా సైకో జగన్ కు బుద్ది రాలేదంటూ తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. దేశమంతా అమరావతి చట్టాన్ని బలపరుస్తుంటే.. జగన్, వైసీపీ పార్టీ మాత్రం వ్యతిరేకిస్తోందని దుయ్యబట్టారు.

‘సవాల్ విసిరితే.. జగన్ సైలెంట్’

రాష్ట్రాభివృద్దితో పాటు రాయలసీమ అభివృద్ధికి సైతం జగన్ ప్రధాన అడ్డంకిగా మారారని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమకు నీళ్లిస్తే బంగారం పండిస్తారనే సిద్ధాంతంతో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని కొనియాడారు. గత ఐదేళ్లలో సీమపై చేసిన ఖర్చుపై చర్చకు రావాలని జగన్‌కు సవాల్ విసిరితే ఇంతవరకూ సమాధానం లేదని మంత్రి ఎద్దేవా చేశారు. కేవలం 20 నెలల్లోనే రాయలసీమ ప్రాజెక్టుల కోసం కూటమి ప్రభుత్వం రూ. 8,000 కోట్లు ఖర్చు చేసిందని గుర్తుచేశారు.

‘ఆ ఘనతా చంద్రబాబుదే’

Advertisement

రూ. 3,870 కోట్లు వెచ్చించి 738 కి.మీ. దూరం నుంచి కుప్పానికి సాగునీరు అందించామని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు. మరోవైపు జగన్ నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయి 39 మంది ప్రాణాలు పోయాని ఆరోపించారు. పులివెందుల ప్రాంతానికి సాగునీరు తీసుకొచ్చిన ఘనత కూడా ముమ్మాటికీ చంద్రబాబుదేనని అన్నారు. అవుకు రిజర్వాయర్ పనులను 3 నెలల్లోనే పూర్తి చేసి 20 వేల క్యూసెక్కుల నీటిని తెచ్చారని ప్రశంసించారు. అయితే జీఓ 365 ద్వారా 102 సాగునీటి ప్రాజెక్టుల పనులను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని మంత్రి ఆరోపించారు.

Also Read: ఇండియా vs చైనా.. రోజువారీ ఖర్చుల్లో తేడా ఏమిటీ? ఎక్కడ ఎక్కువ, ఎక్కడ తక్కువ?

‘జగన్.. రాయలసీమ ద్రోహి’

Advertisement

‘నీరు-చెట్టు’ ద్వారా రాయలసీమలో చెరువులు, వాగులను బాగు చేసి సాగు విస్తీర్ణాన్ని కూటమి ప్రభుత్వం పెంచిందని మంత్రి పేర్కొన్నారు. ఓర్వకల్లు వద్ద లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి సీమ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులతో పారిపోయిన అల్ట్రాటెక్ వంటి పరిశ్రమ మళ్లీ ప్రారంభమవుతోందని తెలిపారు. కర్నూలు ఎయిర్‌పోర్ట్ కట్టింది, ఓర్వకల్లును ఇండస్ట్రియల్ హబ్ చేసింది చంద్రబాబు ప్రభుత్వమేని అన్నారు. తన హయాంలో ఓవరాల్ గా ప్రవేశపెట్టిన రూ. 12 లక్షల కోట్ల బడ్జెట్‌లో జగన్ కనీసం రూ.2 వేల కోట్లు కూడా సీమకు ఖర్చు చేయలేదని మంత్రి ఆరోపించారు. ఏడాదిన్నరలో కుందూనదిపై రిజర్వాయర్ కడతానన్న జగన్ మాట తప్పి రాయలసీమకు ద్రోహం చేశారని విమర్శించారు.

Also Read: టార్గెట్ టీటీడీ ఛైర్మన్.. ఉచ్చుబిగుస్తున్న వైసీపీ.. ఇరకాటంలో టీడీపీ!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×