E-Paper
Advertisement

మనసు మార్చుకున్న బాలినేని.. సీఎం చంద్రబాబుతో భేటీ వెనుక, మేటర్ అదేనా.. మరి ఎప్పుడు?

మనసు మార్చుకున్న బాలినేని.. సీఎం చంద్రబాబుతో భేటీ వెనుక,  మేటర్ అదేనా.. మరి ఎప్పుడు?
Advertisement

Amaravati: ఏపీలో రాజకీయాలు కాస్త వెరైటీగా నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచిపోయింది. కాకపోతే వైసీపీ నుంచి ఎలాంటి ఉలుకు పలుకు లేదు. ఏ విధంగా ప్రభుత్వంతో పోరాటం చేయలేని పరిస్థితి ఆ పార్టీది. కొందరు నేతలు సైలెంట్ అయ్యారు.  జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. సీఎం చంద్రబాబుతో భేటీ కావడంపై కొత్త చర్చ మొదలైంది.

సీఎం చంద్రబాబుతో మాజీ మంత్రి బాలినేని భేటీ 

Advertisement

ఏపీలో రాజకీయాల దృష్టి తన మీద ఉండేలా స్కెచ్ వేశారు జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో నిత్యం ఆయన వార్తల్లోకి వచ్చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆయన వైపు ఎవరూ చూడలేదు. అప్పుడప్పుడు ఆయన గురించి కొన్ని గాసిప్స్ బయటకు వస్తుంటాయి.

జనసేన‌లోకి వెళ్లిన తర్వాత బాలినేని, పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే అధినేత పవన్ కల్యాణ్ నుంచి ఎలాంటి సంకేతాలు వచ్చాయో తెలీదు. కొన్నాళ్లుగా ఆయన అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు లేకపోలేదు. ఇదే సమయంలో సోమవారం అమరావతిలో సీఎం చంద్రబాబుతో బాలినేని భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

భవిష్యత్ రాజకీయాలపై ప్రధానంగా చర్చ

సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కూటమి బలోపేతం, ప్రజా సమస్యలు-భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించినట్టు చెప్పారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమం, కూటమి సమన్వయంపై పలు అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడం జరిగిందని రాసుకొచ్చారు.

ఉన్నట్లుండి సీఎం చంద్రబాబుతో బాలినేని సమావేశంపై జనసేన నేతలు తలో విధంగా చర్చించుకుంటున్నారు. కొంతమంది ఆయనకు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా చెబుతున్నారు. పదవి కోసం ఆయన జనసేన వైపు వచ్చారన్నది ఇంకొందరు వాదన. బాలినేని వ్యవహారంపై అటు టీడీపీలో చర్చ లేకపోలేదు. టీడీపీ వైపు ఆయన చూస్తున్నారా? అంటూ ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.

ALSO READ: చెన్నై కేంద్రంగా ఏపీ రాజకీయాలు.. నిన్న జగన్.. నేడు సీఎం విజయ్‌తో టీడీపీ ఎంపీ సమావేశం 

జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు టీడీపీ సీనియర్లు.  వైసీపీలోని కొందరు నేతలు బాలినేని ద్వారా చర్చలు జరుపుతున్నట్లు పలువురు నేతలు చర్చించుకుంటున్నారు. వైసీపీని నమ్ముకుంటే ఫ్యూచర్ ఉండదని భావించి ఈ విధంగా లైన్ క్లియర్ చేసుకునే పనిలో పడినట్టు చెబుతున్నారు. మొత్తానికి సీఎంతో బాలినేని భేటీ వెనుక అసలు విషయాలు తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందేనా?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×