E-Paper
Advertisement

Balakrishna hot comments: జగన్‌పై రుసరుసలు, ఇదే పాలన..!

Balakrishna hot comments: జగన్‌పై రుసరుసలు, ఇదే పాలన..!
Advertisement

Balakrishna hot comments: జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. అరాచకం కావాలా? అభివృద్ది కావాలో ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి ఉందా అని ఓటర్లను ప్రశ్నించారు బాలకృష్ణ. ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ డ్రామాలు అన్నీఇన్నీకావన్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా సోమవారం ఉమ్మడి కర్నూలు జిల్లా కర్నూలు టౌన్, నంద్యాల, నందికొట్కూరు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు.

టీడీపీ హయాంలో రాయలసీమను శాంతికి చిరునామాగా మారిస్తే.. వైసీపీ రూలింగ్‌లో నెత్తుటి మరకలు అంటించారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం దాదాపు 12 లక్షల కోట్ల అప్పులు చేసిందని దుయ్యబట్టారు. కేంద్ర సహకారం కోసమే బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుందని వెల్లడించారు. ముస్లింలను టీడీపీ ఎన్నడూ ఓటు బ్యాంకుగా చూడలేదన్నారు. వారిని సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఎదిగేలా చేసేందుకు తమ పార్టీ చర్యలు చేపట్టిందన్నారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం జనసే అధినేత పవన్‌కల్యాణ్ సంపూర్ణ సహకారం అందిస్తున్నారని గుర్తుచేశారు.

Advertisement

పనిలోపనిగా స్థానిక ఎమ్మెల్యేలపై కూడా విరుచుకుపడ్డారు బాలకృష్ణ. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి యువత నుంచి డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. ముఖ్యంగా వైసీపీ పాలనలో రాష్ట్ర ఎలా నష్టపోయిందో సుమారు గంటపాటు ఆయన వివరించారు. సీఎం జగన్ తన తల్లిని, చెల్లిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశారని దుయ్యబట్టారు. బాబాయిని చంపిన నిందితుడికి ఆశ్రయం ఇచ్చారని పైగా ఎంపీ అభ్యర్థిగా నిలబట్టారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల సునామీలో వైసీపీ కొట్టుకోవడం ఖాయమని, దుర్మార్గాలకు ఫుల్‌స్టాప్ పడబోతోందన్నారు.

Advertisement

 

 

 

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×