E-Paper
Advertisement

AP Assembly Sessions : రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు.. స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం

AP Assembly Sessions : రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు.. స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం
Advertisement

AP Assembly Speaker Ayyanna Patrudu(Andhra politics news): ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌ (AP Assembly Speaker) గా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి ఎమ్మెల్యేలు ఆయన్ను స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీడీపీ తరుపున నర్సీపట్నం నుంచి అయ్యన్నపాత్రుడు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994-96లో రహదారులు, భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

1996లో టీడీపీ తరుపున అనకాపల్లి ఎంపీగా గెలిచారు. 1999లో టీడీపీ ప్రభుత్వంలో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2014 ఎన్నికలలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చాక మంత్రిగా మరోసారి బాధ్యతలు స్వీకరించారు.నర్సీపట్నంలో తిరుగులేని నాయకునిగా ఎదిగిన అయ్యన్న..2019లో ఓటమి పాలయ్యారు. ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో మళ్లీ గెలుపు జెండా ఎగురవేసి.. అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

Advertisement

కాగా.. సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ భవన్ లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతను ప్రకటించనున్నారు. కేంద్రమంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ ఉన్నారు. లోక్ సభ సమావేశాల్లో టీడీపీ ఎంపీలు అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై, రాష్ట్రానికి నిధులు తీసుకురావడంపై చర్చించి.. ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×