E-Paper
Advertisement

Avinash Reddy : అవినాష్ రెడ్డి అరెస్ట్ పై ఉత్కంఠ.. బెయిల్ వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ..

Avinash Reddy : అవినాష్ రెడ్డి అరెస్ట్ పై ఉత్కంఠ.. బెయిల్ వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ..
Advertisement

Avinash Reddy : వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ సిద్ధం కావటం ఉత్కంఠ రేపుతోంది. అరెస్టును సహించబోమంటూ అవినాష్ రెడ్డి తల్లి చికిత్స పొందుతున్న కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి ఎదుట బైఠాయించి అనుచరుల ఆందోళనకు దిగడం మరింత ఉద్రిక్తతను పెంచింది. వైసీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు అక్కడి రావడంతో హైటెన్షన్ నెలకొంది. రాష్ట్ర పోలీసుల వ్యవహారశైలిపైనా విమర్శలు వస్తున్నాయి. సీబీఐకు సహకరించడంలేదని ఆరోపణలు వస్తున్నాయి.

మరోవైపు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ తక్షణం విచారించేలా ఆదేశాలు జారీ చేయాలని మిసిలేనియస్‌ అప్లికేషన్‌ వేశారు. దీనిపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.

Advertisement

వివేకా హత్యకేసులో విచారణకు హాజరుకావాలని సీబీఐ తాజాగా అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అవినాష్‌రెడ్డి తరఫు లాయర్లు ఈ కేసును సోమవారం జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ ధర్మాసనం ముందు ఉంచారు. తన తల్లి అనారోగ్యం కారణంగా వారం రోజులపాటు సీబీఐ విచారణకు హాజరుకాలేనని అందులో అవినాష్ పేర్కొన్నారు. తన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ తక్షణం విచారించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

సీబీఐ విచారణకు హాజరుకాలేని పరిస్థితి ఉన్నందున మధ్యంతర ఉపశమనం ఇవ్వాలని అవినాష్‌రెడ్డి సుప్రీంకోర్టును విజ్ఞప్తి చేశారు. ఈ కేసును జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం ముందు కోర్టు లిస్ట్‌ చేసింది. నేడు సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలపై ఉత్కంఠ ఏర్పడింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×