E-Paper
Advertisement

Avinash Reddy : విచారణకు డుమ్మా.. సీబీఐ మళ్లీ నోటీసులు.. నెక్ట్స్ ఏంటి?

Avinash Reddy : విచారణకు డుమ్మా.. సీబీఐ మళ్లీ నోటీసులు.. నెక్ట్స్ ఏంటి?
Advertisement

Advertisement

Avinash Reddy Latest News(Andhra Pradesh News): అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు డుమ్మా కొట్టారు. సీబీఐను 4రోజుల గడవు కోరారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ నుంచి కడప జిల్లాకు అవినాష్ రెడ్డి వెళ్లిపోయారు. నాలుగు రోజుల తర్వాతే విచారణకు వస్తానని సీబీఐకు లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. అవినాష్ రిక్వెస్ట్‌కు సీబీఐ ఓకే చేసింది. ఆయన కోరినట్టే 4 రోజుల గడువు ఇచ్చింది.

మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని తమ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. సీఆర్‌పీసీ 160 సెక్షన్‌ కింద నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే అనేకసార్లు ఆయనను సీబీఐ ప్రశ్నించింది. అయితే గత 20 రోజులుగా ఈ కేసు విచారణ చేపట్టలేదు.

Advertisement

వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి పాత్ర, ప్రమేయం ఉందని సీబీఐ అంటోంది. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై దాఖలు చేసిన కౌంటర్‌లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శివశంకరరెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ అంటోంది. ఈ నేపథ్యంలోనే అవినాష్‌రెడ్డి విచారణపై ఉత్కంఠ నెలకొంది. కొన్ని రోజులుగా వివేకా హత్య కేసు విచారణకు తాత్కాలికంగా సీబీఐ విరామిచ్చింది. ఆ సమయంలో డిల్లీ వెళ్లిన సీబీఐ బృందం సోమవారమే తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంది.

వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుండగానే సీబీఐ విచారణకు హాజరయ్యారు. అయితే అప్పుడే అరెస్ట్ చేయొచ్చని ప్రచారం జరిగింది. కానీ సీబీఐ మాత్రం అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు మరోసారి విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. కానీ అవినాష్ రెడ్డి విచారణ హాజరుకాకుండా గడువు కోరారు. అవినాష్ రెడ్డి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించింది సీబీఐ. ఆయన కోరినట్టే 4 రోజుల గడువిస్తూ.. ఈ నెల 19న విచారణకు రావాలంటూ మళ్లీ నోటీసులు ఇచ్చింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×