E-Paper
Advertisement

CBI : మళ్లీ సీబీఐ విచారణ అవినాష్ రెడ్డి.. వాట్ నెక్ట్స్..?

CBI : మళ్లీ సీబీఐ విచారణ అవినాష్ రెడ్డి.. వాట్ నెక్ట్స్..?
Advertisement

CBI :వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. మరోసారి విచారణ రావాలని నోటీసులు అందడంతో ఆయన.. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఇద్దరు న్యాయవాదులతో కలిసి విచారణకు వచ్చారు.

వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి పాత్రే కీలకమని సీబీఐ అనుమానిస్తోంది. అవినాష్ తండ్రి భాస్కర్‌రెడ్డి ప్రమేయం కూడా ఉందని భావిస్తోంది. వివేకా హత్య కేసులో అవినాస్ రెడ్డిని తొలిసారి జనవరి 28న సీబీఐ ప్రశ్నించింది. ఆ సమయంలో హైదరాబాద్‌ కోఠిలోని కార్యాలయంలో సీబీఐ అధికారులు నాలుగున్నర గంటలపాటు ప్రశ్నించారు.

Advertisement

అవినాష్ రెడ్డి కాల్ డేటా ఆధారంగా తొలి విడత సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకా హత్యకు ముందు తర్వాత రెండు ఫోన్ నంబర్లు అవినాష్ వాడినట్లు గుర్తించారు. సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సతీమణి భారతి వ్యక్తిగత సహాయకుడు నవీన్‌ నంబర్లకు కాల్‌ చేసినట్లు నిర్ధారించారు. దీంతో ఆ తర్వాత కృష్ణమోహన్‌ రెడ్డి, నవీన్ ను కడపలో సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వారి నుంచి రాబట్టిన సమాచారంతో సీబీఐ దర్యాప్తును ముందుకు తీసుకెళుతోంది.

వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని ఈ నెల 23న, అవినాశ్‌రెడ్డిని 24న విచారణకు రావాలంటూ సీబీఐ ఈ నెల 18న నోటీసులు ఇచ్చింది. 23న హాజరుకాలేనని భాస్కర్‌రెడ్డి సీబీఐకి సమాచారం ఇచ్చారు. అవినాశ్‌ రెడ్డి మాత్రం మరోసారి సీబీఐ ముందు హాజరయ్యారు. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి చుట్టూ వివేకా హత్య కేసు బిగుస్తోంది. తాజాగా కోర్టులో దాఖలు చేసిన కౌంటర్ లో సీబీఐ తండ్రికొడుకుల ప్రమేయం ఆధారాలను పొందుపర్చింది. ఈ కోణంలో దర్యాప్తు చేస్తోంది. హత్యకు 40 కోట్లకు డీల్ జరిగిందని అభియోగాలు మోపింది. ఆ దిశగా మరిన్ని ఆధారాలు సేకరించేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది. మరి అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారా?

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×