E-Paper
Advertisement

Nellore : టీడీపీ నేత ఆనంపై దాడికి ప్రయత్నం.. వైసీపీ ఫ్యాక్షన్ ముఠాల పనేనని లోకేశ్‌ ఆరోపణ..

Nellore : టీడీపీ నేత ఆనంపై దాడికి ప్రయత్నం.. వైసీపీ ఫ్యాక్షన్ ముఠాల పనేనని లోకేశ్‌ ఆరోపణ..
Advertisement

Nellore News Today Telugu(AP Political News) : నెల్లూరులో పట్టపగలే దుండగులు బరితెగించారు. టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నించారు. ఆయన ఆర్టీఏ కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా 10 మంది బైక్‌లపై వచ్చి కర్రలతో దాడికి యత్నించారు. వెంటనే టీడీపీ కార్యకర్తలు, ఆనం అనుచరులు వారిని అడ్డుకున్నారు. దీంతో దుండగులు అక్కడికి నుంచి పరారయ్యారు.

కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఆనం వెంకటరమణారెడ్డి ఘాటు విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారంటూ అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించారు. అందువల్లే వైసీపీ కార్యకర్తలే ఈ దాడికి ప్రయత్నించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Advertisement

ఆనంపై దాడికి ప్రయత్నం జరిగిందనే విషయం తెలియగానే సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కొంతమంది టీడీపీ నేతలు అక్కడికి చేరుకుని వెంకటరమణారెడ్డితో మాట్లాడారు. వివరాలు తెలుసుకున్నారు. ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి యత్నాన్ని సోమిరెడ్డి తప్పుపట్టారు. వైసీపీ నాయకులు బరితెగిస్తున్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో పట్టపగలు దాడులు చేసే కొత్త సంస్కృతికి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. దాడి జరిగిన సమాచారం పోలీసులకు తెలిపితే.. ఇద్దరు కానిస్టేబుళ్లను పంపి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.

ఆనం వెంకటరమణారెడ్డిపై దుండగులు దాడికి యత్నించిన ఘటనను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండించారు. ఇది వైసీపీ మూకల పనే అని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే ఉలికిపడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ఫ్యాక్షన్‌ ముఠాలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×