E-Paper
Advertisement

AP : షర్మిలపై కోడిగుడ్లతో దాడి.. విజయవాడలో హైటెన్షన్

AP : షర్మిలపై కోడిగుడ్లతో దాడి.. విజయవాడలో హైటెన్షన్
Advertisement

AP : బెజవాడలో హైటెన్షన్. ఆంధ్రరత్నా భవన్‌లో అలజడి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల టార్గెట్‌గా కోడిగుడ్లు, టమోటాలు విసిరారు బీజేపీ కార్యకర్తులు. షర్మిల మీదకు ట్యూబ్‌లైట్ కూడా విసిరారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గంట పాటు తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.

ఉదయం నుంచే హైటెన్షన్

Advertisement

ఏపీ రాజధాని అమరావతి పున:ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రానున్నారు. ఆయన రాకకు నిరసనగా కాంగ్రెస్ తరఫున నిరసన కార్యక్రమం చేపట్టారు పార్టీ చీఫ్ షర్మిల. ఉద్దండరాయపాలెం వెళ్లి ధర్నా చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే, షర్మిలను ఉదయమే హౌజ్ అరెస్ట్ చేసి.. బయటకు రాకుండా కట్టడి చేశారు పోలీసులు. మధ్యాహ్నం తర్వాత కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చిన షర్మిల.. ప్రెస్‌మీట్ పెట్టారు. సరిగ్గా అదే సమయంలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆంధ్రరత్నా భవన్‌పై దాడి చేశారు. కోడిగుడ్లు, టమోటాలను కాంగ్రెస్ భవన్ మీదకు విసిరి నానాహంగామా చేశారు.

షర్మిలపై ట్యూబ్‌లైట్ 

Advertisement

దాడి గురించి తెలిసి వైఎస్ షర్మిల.. పార్టీ ఆఫీసు నుంచి బయటకు వచ్చారు. కార్యాలయ ప్రాంగణంలో బైఠాయించి నిరసన తెలిపారు. అదే సమయంలో పక్కనున్న బిల్డింగ్ నుంచి గుర్తి తెలియని వ్యక్తులు ట్యూబ్‌లైట్ విసిరారు. ఆ ట్యూబ్‌లైట్ షర్మిల సమీపంలో పడి పగిలిపోయింది.

పోలీసుల లాఠీఛార్జ్

బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. కాషాయ శ్రేణులు కాంగ్రెస్ భవన్‌లోని దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. గేటుకు అడ్డంగా నిలబడి కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ నేతలను అడ్డుకున్నారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ఇరు వర్గాలపై లాఠీఛార్జ్ చేశారు. బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.

బీజేపీ నేతలదే బాధ్యత

తనపై దాడికి ప్రయత్నించిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వమే దీనికి సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసుపై దాడికి తెగించిన బీజేపీ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జరిగిన దారుణంపై ఏపీ బీజేపీ నేతలే బాధ్యత తీసుకొవాలన్నారు వైఎస్ షర్మిల. తనపైనే దాడికి ప్రయత్నిస్తే.. రాష్ట్రంలో మహిళలకు ఇంకేం రక్షణ ఉంటుందని ప్రశ్నించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×