E-Paper
Advertisement

Chittoor: అల్లరి చేస్తోందని విద్యార్థిని పుర్రె పగలకొట్టిన టీచర్..

Chittoor: అల్లరి చేస్తోందని విద్యార్థిని పుర్రె పగలకొట్టిన టీచర్..
Advertisement

Chittoor: విద్యార్థులను ఉపాధ్యాయులు దండించడం కామనే.. కానీ, చావబాదే ఘటనలే.. ఉపాధ్యాయుల మానసిక స్థితికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా ఓ విద్యార్థినిని దండించే క్రమంలో ఉపాధ్యాయుడు తలపై కొడితే.. విద్యార్థిని తల పగిలింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.

క్లాస్‌రూమ్‌లో అల్లరి చేస్తోందని స్కూల్‌ బ్యాగ్‌తో.. బాలిక తలపై కొట్టిన హిందీ టీచర్‌..
పుంగనూరుకు చెందిన 11 ఏళ్ల సాత్విక నాగశ్రీ స్థానిక ప్రైవేట్‌ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. క్లాస్‌ రూమ్‌లో అల్లరి చేస్తోందని ఆమె తలపై స్కూల్‌ బ్యాగ్‌తో కొట్టాడు హిందీ టీచర్‌. అదే స్కూల్లో బాలిక తల్లి విజేత పనిచేస్తోంది. అయితే, టీచర్‌ మాములుగానే దండించి ఉంటాడని భావించి లైట్‌ తీసుకుంది బాలిక తల్లి. మరుసటి రోజు నుంచి తలనొప్పిగా ఉందని మూడు రోజులుగా నాగశ్రీ పాఠశాలకు వెళ్లలేదు. దాంతో బాలికను పుంగనూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. బాలికను పరీక్షించిన పుంగనూరు వైద్యులు.. బెంగళూరు వెళ్లాలని సూచించారు. బాలికను బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చూపించగా.. పుర్రె ఎముక చిట్లినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో స్కూల్‌ యాజమాన్యంపై విద్యార్థిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

మాములుగానే కొట్టి ఉంటాడనుకొని భావించిన బాలిక తల్లి
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన దారుణ ఘటన స్థానికంగా మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆందోళన రేపింది. ఈ నెల 10వ తేదీన తరగతి గదిలో అల్లరి చేస్తోందని ఆరో తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలిక సాత్విక నాగశ్రీని హిందీ ఉపాధ్యాయుడు స్కూల్ బ్యాగ్‌తో తలపై కొట్టాడు. అదే స్కూల్లో బాలిక తల్లి విజేత పనిచేస్తోంది. అయితే, టీచర్‌ మాములుగానే దండించి ఉంటాడని భావించి లైట్‌ తీసుకుంది బాలిక తల్లి. అయితే మరుసటి రోజు నుంచి తలనొప్పిగా ఉందని మూడు రోజులుగా నాగశ్రీ పాఠశాలకు వెళ్లలేదు.

బెంగళూరు తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సూచించిన వైద్యులు..
దాంతో బాలికను పుంగనూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. బాలికను పరీక్షించిన పుంగనూరు వైద్యులు.. బెంగళూరు వెళ్లాలని సూచించారు. బాలికను బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చూపించగా.. పుర్రె ఎముక చిట్లినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. సాత్విక నాగశ్రీ తల్లిదండ్రులు హరి, విజేతలకు.. వైద్యులు ఈ గాయం తీవ్రమైనది, శస్త్రచికిత్స అవసరమని తెలిపారు. బాలిక ప్రస్తుతం బెంగళూరులో చికిత్స పొందుతోంది, కానీ పూర్తి రికవరీకి సమయం పడవచ్చు.

Advertisement

Also Read: దారుణం.. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి

స్కూల్ యాజమాన్యంపై విద్యార్థిని తల్లి, బంధువులు పోలీసులకు ఫిర్యాదు..
ఈ ఘటన జరిగిన తర్వాత బాలిక తల్లి, బంధువులు సోమవారం రాత్రి పుంగనూరు పోలీస్ స్టేషన్‌లో స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు నమోదు చేశారు. ఫిర్యాదులో, ఉపాధ్యాయుడు చట్టవిరుద్ధంగా శారీరక శిక్ష అమలు చేయడం, బాలికకు తీవ్ర గాయాలు కలిగించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు ఈ కేసును రిజిస్టర్ చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. పుంగనూరు ప్రాంతంలోని తల్లిదండ్రులు, విద్యార్థులు స్కూల్ మేనేజ్‌మెంట్‌పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×