E-Paper
Advertisement

నీ బ్రతుకంతా అబద్ధాల పునాదే.. జగన్‌పై మంత్రి అచ్చన్నాయుడు ఫైర్!

నీ బ్రతుకంతా అబద్ధాల పునాదే.. జగన్‌పై మంత్రి అచ్చన్నాయుడు ఫైర్!
Advertisement

 Atchannaidu: ఏపీ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖపట్నంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన జగన్.. అక్కడ చేసిన వ్యాఖ్యలను అచ్చన్నాయుడు తీవ్రంగా ఖండించారు. జగన్ పర్యటన కేవలం రాజకీయ డ్రామా అని, ఆయనకు మత్స్యకారుల గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు లేదని మండిపడ్డారు.

మాజీ మంత్రి కొడుకు నిర్వాకంపై ఎందుకు మాట్లాడలేదు?

Advertisement

‘గొడ్డలి పార్టీ నేత విశాఖపట్నం పర్యటనకు వెళ్లారు. మీ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు కారుతో ఒక వ్యక్తిని గుద్ది, కనీసం వైద్యం కూడా చేయించకుండా వదిలేయడంతో ఆ వ్యక్తి చనిపోయారు. కనీసం ఆ బాధితుడి కుటుంబాన్ని పలకరిస్తావని అనుకున్నాం.. కానీ నీ గొడ్డలి పార్టీ అబద్ధాల పునాదులపైనే పుట్టింది కాబట్టి ఆ ఊసే ఎత్తలేదు. గొర్రెల కాపరి కుటుంబాన్ని పరామర్శించకుండా, విశాఖ వెళ్లి తప్పుడు కూతలు కూస్తున్నారు’ అని అచ్చన్నాయుడు మండిపడ్డారు.

ప్రభుత్వం వెంటనే స్పందించింది..

Advertisement

ప్రకృతి వైపరీత్యం కారణంగా విశాఖలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారని, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు తక్షణమే స్పందించి ప్రాణాలు కాపాడే చరిత్ర చంద్రబాబునాయుడిదని మంత్రి గుర్తుచేశారు. ‘టెక్నికల్ కారణాల వల్లే బోటు ఎక్కడ మునిగిపోయిందో తెలియక కాపాడలేకపోయాం. ప్రమాదాలు జరగకూడదనే ప్రతి బోటుకూ ట్రాన్స్‌పాండర్లు పెట్టాం. ఈ సంఘటన జరిగిన రోజు ఉదయం 10:30 గంటలకు మా శాఖకు సమాచారం రాగా, వెంటనే స్పందించి 11:30 గంటలకల్లా కోస్ట్‌గార్డ్, నేవీలకు సమాచారం అందించి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాం. కిలోమీటర్లకు, నాటికల్ మైళ్లకు తేడా తెలియకుండా జగన్ మాట్లాడుతున్నారు. ఈ ప్రమాదం తీరానికి 11 నాటికల్ మైళ్ల దూరంలో జరిగింది’ అని స్పష్టం చేశారు.

జగన్ హయాంలో 270 మంది చనిపోయారు..

గత ఐదేళ్ల జగన్ పాలనలోనూ ప్రకృతి వైపరీత్యాల వల్ల 270 మంది మత్స్యకారులు చనిపోయారని అచ్చన్నాయుడు గుర్తుచేశారు. ‘ఆ 270 మందిలో కనీసం ఒక్క వ్యక్తి కుటుంబైనా నువ్వు పరామర్శించావా? వారికి కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు. నువ్వు అధికారం కోల్పోయి, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాకే ఆ బాధితులకు పరిహారం అందింది. మీ హయాంలో చనిపోతే అది ప్రకృతి వైపరీత్యం.. మా హయాంలో జరిగితే మేమే చంపేశామన్నట్టు అవివేకంగా మాట్లాడటం నీకే చెల్లింది’ అని ధ్వజమెత్తారు.

కంటి ఆపరేషన్ జరిగినా పర్యవేక్షించా..

ముప్పై ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా అర నిమిషంలో అక్కడ వాలిపోయే వ్యక్తి అచ్చన్నాయుడు అని మంత్రి చెప్పుకొచ్చారు. ‘ప్రమాదం జరిగిన రోజు నా రెండు కళ్లకు క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగింది. కళ్లకు కట్లు ఉన్నప్పటికీ.. సమాచారం తెలియగానే వెంటనే మంత్రి కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఘటనా స్థలానికి, బాధితుల కుటుంబాల వద్దకు పంపాను. జగన్ చేసే ప్రతి తప్పు సీసీ కెమెరాల్లో బయటపడుతూనే ఉంది. ప్రభుత్వానికి మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తాం కానీ, నీ బతుకంతా ఇలాగే అబద్ధాలు మాట్లాడుతావు’ అని అచ్చన్నాయుడు తీవ్రంగా దుయ్యబట్టారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×