E-Paper
Advertisement

Parvathipuram Manyam: ఆంధ్రప్రదేశ్‌లో షాకింగ్ ఘటన.. విద్యాసంస్థలో అశ్లీల డాన్సుల కలకలం!

Parvathipuram Manyam: ఆంధ్రప్రదేశ్‌లో షాకింగ్ ఘటన.. విద్యాసంస్థలో అశ్లీల డాన్సుల కలకలం!
Advertisement

Parvathipuram Manyam: విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన పాఠశాలలు, నేడు అశ్లీల కార్యక్రమాలకు నిలయంగా మారుతున్నాయి. సమాజానికి మార్గనిర్దేశం చేయాల్సిన గురువులే పెడతోవ పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. పార్వతీపురం మన్యం జిల్లా నీలకంఠపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యా వ్యవస్థకే మచ్చ తెచ్చేలా రికార్డింగ్ డ్యాన్సుల ప్రదర్శన జరగడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం, సదరు ఆశ్రమ పాఠశాల వార్డెన్ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఈ అశ్లీల నృత్యాల ప్రదర్శన నిర్వహించబడింది. వార్డెన్ చంద్రమోహన్ స్థానిక టీడీపీ మహిళా ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహిత బంధువు కావడంతో, అధికార గర్వంతో నిబంధనలను తుంగలో తొక్కినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక ప్రభుత్వ విద్యాసంస్థ ప్రాంగణంలోనే రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేయడం, అందులోనూ పవిత్రమైన విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన చిన్నారుల ముందే ఇలాంటి అసభ్యకర ప్రదర్శనలు జరపడం బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది.

Advertisement

కేవలం బయటి కళాకారులతోనే కాకుండా, హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న చిన్న పిల్లల చేత కూడా వార్డెన్ అశ్లీల డ్యాన్సులు వేయించడం పట్ల స్థానికులు, గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాల్సిన చోట ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అండ చూసుకుని విద్యాసంస్థను అపవిత్రం చేసిన సదరు వార్డెన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని, ఈ ఘటనపై ఐటీడీఏ (ITDA), విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Read Also: Mumbai Crime: దొంగగా మారిన బిజినెస్‌మేన్.. చివరకు పోలీసులకు చిక్కాడు? జల్సాల వల్లేనా?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×