E-Paper
Advertisement

Arava Sridhar: అరవ శ్రీధర్ ఇష్యూ.. అంతా కారులో, మరో వీడియో రిలీజ్ చేసిన వీణ

Arava Sridhar: అరవ శ్రీధర్ ఇష్యూ.. అంతా కారులో,  మరో వీడియో రిలీజ్ చేసిన వీణ
Advertisement

Arava Sridhar: అరవ శ్రీధర్ వ్యవహారం సీరియల్ మారిదిగా రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. దీనికి ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడినట్టు కనిపించలేదు. శ్రీధర్‌పై బాధితురాలు ఓవైపు ఆరోపణలు చేస్తూ.. మరోవైపు వారిద్దరి వీడియోలను బయట పెడుతోంది. తాజాగా బాధితురాలు మరొక వీడియో విడుదల చేసింది.

అరవ శ్రీధర్ ఇష్యూ.. అంతా కారులో

Advertisement

రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం సీరియల్ మాదిరిగా సా..గుతోంది.  తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని తెగేసి చెబుతోంది బాధితురాలు. రోజు లేదా రెండురోజుల కొకసారి మీడియా   మందుకొస్తుంది బాధితురాలు. లేకుంటే వీడియోలను రిలీజ్ చేస్తోంది. తాజాగా శ్రీధర్‌తో కలిసి కారులో ఎంజాయ్ చేస్తున్న వీడియో బయటపెట్టింది. దీంతో తామిద్దరి బంధం ఎంత గొప్పదో చెప్పే ప్రయత్నం చేసింది.

ఇద్దరు కలిసి సరదాగా కార్లో వెళ్తున్న దృశ్యాలను షేర్ చేసింది మహిళ ఉద్యోగి. ఇప్పటివరకు శ్రీధర్‌తో చేసిన చాటింగ్‌లను విడుదల చేసిన ఆమె, తొలిసారి ఇద్దరు కలిసున్న వీడియో బయటపెట్టింది. బాధితురాలు వీణతో కారులో శ్రీధర్ షికారు చేస్తున్న దృశ్యాలు అవి. తమ మధ్య సాన్నిహిత్యాన్ని ఇదే సాక్ష్యమని అంటోంది.

Advertisement

మరొక వీడియో రిలీజ్ చేసిన బాధితురాలు

ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్‌పై  త్రిసభ్య కమిటీ చర్యలకు రెడీ అవుతోన్న నేపథ్యంలో బాధితురాలు విడుదల చేసిన లేటెస్టు వీడియో సంచలనం రేపుతోంది. మరోవైపు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణపై త్రిసభ్య కమిటీ పూర్తిస్థాయి నివేదిక రెడీ చేసింది. ఈ వారంలో పార్టీ హైకమాండ్‌కు ఇవ్వనుంది. ఆయనపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటోందని ఆ నియోజకవర్గం పార్టీల నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయినా సరే బాధితురాలు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అన్నట్లు బుధవారం మీడియా ముందుకొచ్చిన కీలక విషయాలు బయటపెట్టింది బాధిత మహిళ. శ్రీధర్‌కు ఆరుగురు అమ్మాయిలతో సంబంధం ఉందని కొత్త బాంబు పేల్చింది. వారితో నిత్యం మాటలు, ఛాటింగ్ చేసేవారని ఆరోపించింది. ఈ విషయం తెలిసిన తర్వాత దూరంగా ఉండాలని భావించానని, కానీ పెళ్లి చేసుకుంటానని నమ్మించారని చెప్పుకొచ్చింది.

ALSO READ: విశాఖలో బాంబు కలకలం.. చెత్తకుప్పలో లైట్లు వెలుతురు చూసి హంగామా 

ముందు జాగ్రత్తగా వీడియోలు రికార్డు చేశానని, ఆ తర్వాత తనను దూరం పెట్టడం మొదలుపెట్టారని పేర్కొంది. తనపై చేస్తున్న ఆరోపణలపై కౌంటరిచ్చే ప్రయత్నం చేసింది. రైల్వేకోడూరులో శ్రీధర్ డమ్మీ వ్యక్తని, నియోజకవర్గంలో ఎవర్ని అడిగినా చెబుతారని తెలిపింది. తాను 25 కోట్లు అడిగాననేది పూర్తిగా అబద్ధమని, ఆడియో వాయిస్ తనది కాదని తేల్చి చెప్పింది.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×