E-Paper
Advertisement

APSRTC EHS Scheme: ఒకసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం ఉచిత వైద్యం.. వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

APSRTC EHS Scheme: ఒకసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం ఉచిత వైద్యం.. వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
Advertisement

APSRTC EHS Scheme: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈహెచ్ఎస్ స్కీమ్ కింద వైద్య సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. జనవరి 1, 2020 తర్వాత రిటైర్డైన ఉద్యోగులకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఒకసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం ఉచిత వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగితో పాటు జీవిత భాగస్వామికి ఉచితంగా వైద్య సౌకర్యాలు అందించనున్నారు. ఆర్టీసీ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం, మందులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

మెడికల్ రియంబర్స్మెంట్ సదుపాయం

ఈ మేరకు సింగిల్ ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సూపరింటెండెంట్‌ కేటగిరీ వరకు రూ.38,572 ప్రీమియం, అసిస్టెంట్‌ మేనేజర్‌, ఆపై ర్యాంకు వారికి రూ.51,429 సింగిల్ ప్రీమియం చెల్లించాలని సూచించింది. ఆర్టీసీ ఆస్పత్రుల సిఫార్సులతో ఈహెచ్‌ఎస్‌ ఆస్పత్రుల్లో విశాంత్ర ఉద్యోగులకు చికిత్స అందించనున్నారు. ప్రస్తుత ఉద్యోగులకు అందించే మెడికల్ రియంబర్స్‌మెంట్‌ సౌకర్యాన్ని విశాంత్ర ఉద్యోగులకు కల్పించనున్నారు. ఈహెచ్ఎస్ స్కీమ్ ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. సీఎం చంద్రబాబు, ఆర్టీసీ ఎండీ, అధికారులకు ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి.

ఆర్టీసీలో పదోన్నతులు

Advertisement

ఏపీఎస్ఆర్టీసీలో పలువురు ఉన్నతాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పదోన్నతులు కల్పించింది. రీజనల్ మేనేజర్ హోదాలో పనిచేస్తున్న ఆరుగురు ఆర్టీసీ అధికారులను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ప్రభుత్వం ప్రమోట్ చేసింది. ఇప్పటి వరకు వీరంతా ఇన్‌ ఛార్జ్ ఈడీలుగా పనిచేస్తుండగా, ఇటీవల వారికి పూర్తిస్థాయి ఈడీలుగా పదోన్నతులు కల్పించింది. పదోన్నతి పొందిన అధికారులలో విజయవాడ జోన్ లో జి. విజయరత్నం, జీవీ రవివర్మ, టి. చెంగల్‌రెడ్డి ఉన్నారు. వీరితో పాటు కడప జోన్ పి. చంద్రశేఖర్‌, ఆపరేషన్స్ కు చెందిన ఎ. అప్పలరాజు, నెల్లూరు జోన్ కు చెందిన జి. నాగేంద్రప్రసాద్‌ లకు ఈడీలుగా ప్రమోషన్ కల్పించారు.

Also Read: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ విమర్శించిన డీఎస్పీకి కేంద్రం అవార్డ్.. ఇంతకీ ఎందుకు ఇచ్చిందో తెలుసా..?

Advertisement

మరో 15 మంది సీనియర్ కేడర్ అధికారులకు కూడా ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. వీరిని స్పెషల్ స్కేల్ సర్వీస్ కేడర్‌కు పదోన్నతులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ పదోన్నతుల ద్వారా ఆర్టీసీ కీలక విభాగాల్లో పరిపాలనను పటిష్ఠం చేయనుంది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×