E-Paper
Advertisement

AP Rains: బంగాళాఖాతంలో మరో తుపాన్.. నవంబర్ 29 నుంచి వర్షాలు.. రైతులకు అలర్ట్

AP Rains: బంగాళాఖాతంలో మరో తుపాన్.. నవంబర్ 29 నుంచి వర్షాలు.. రైతులకు అలర్ట్
Advertisement

AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమలో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మలక్కా జలసంధి ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది. రాగల ఆరు గంటల్లో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.

నవంబర్ 29 నుంచి వర్షాలు

అనంతరం 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో కొమోరిన్, నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపింది. రాగల 24 గంటల్లో ఇది బలపడే అవకాశం ఉందని వివరించింది. గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లళరాదని హెచ్చరించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని సూచించింది. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకు (నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2) కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రైతులు అప్రమత్తమై వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

మొంథాతో భారీగా నష్టం

Advertisement

ఇటీవలి మొంథా తుపాన్‌ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో భారీగా పంట నష్టం జరిగింది. మొంథా తుపాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికి వచ్చిన పంట నీటి పాలైందని రైతులు ఆవేదనలో ఉన్నారు. ఇంతలో వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా బలపడుతోందని తెలిపింది. రేపటికి తుపాన్‌గా బలపడనుందని ఐఎండీ అంచనా వేస్తుంది. తుపాన్‌గా ఏర్పడిన తర్వాతా దానికి సెన్‌యార్‌గా పేరు పెట్టనున్నట్లు ఐఎండీ తెలిపింది.

Also Read: Lokesh Foreign Tour: మంత్రి లోకేష్ అమెరికా టూర్ ఖరారు.. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో, ఆ కంపెనీల ప్రతినిధులతో భేటీ

రైతులకు అలర్ట్

Advertisement

వాయుగుండం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ బుధవారం రాత్రి తర్వాత తుపాన్‌గా బలపడనుందని ఐఎండీ అంచనా వేస్తోంది. శ్రీలంకకు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని ఐఎండీ తెలిపింది. వరుస అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తుపాన్ గా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పంటలు కోత దశలో ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులు సూచించింది.

రైతులు అప్రమత్తంగా ఉండాలి – మంత్రి అచ్చెన్నాయుడు

తుపాను ముప్పు నేప‌థ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. ద‌క్షిణ అండ‌మాన్ స‌ముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడ‌నం వాయుగుండంగా మారే అవ‌కాశం ఉన్నందున, రానున్న 48 గంట‌ల్లో తుపాను తీవ్రత పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

  • పంటల భద్రత: ముఖ్యంగా వరి కోతలు కోసిన రైతులు వెంటనే తమ పంటను/ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.
  • టార్పలిన్ స‌ర‌ఫ‌రా: రైతులకు ధాన్యం కాపాడుకునేందుకు వీలుగా, ప్రభుత్వం తరపున ఉచితంగా టార్ప‌లిన్ పట్టాలు పంపిణీ చేస్తున్నాం. జిల్లా యంత్రాంగం ద్వారా వాటిని సద్వినియోగం చేసుకోండి.
  • అధికారుల సూచనలు: వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులకు జాగ్రత్తలు చెబుతారు. వారి సూచనలను తప్పక పాటించాలి.
  • మత్స్యకారులకు విజ్ఞప్తి: సముద్రం అల‌జ‌డిగా మారుతున్నందున, మత్స్యకారులు వేట‌కు వెళ్లరాదు. వేట‌కు వెళ్లిన వారు తక్షణమే ఒడ్డుకు చేరుకోవాలి.
  • అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు, రైతాంగానికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×