E-Paper
Advertisement

AP Weather Update: ఏపీలో విచిత్ర వాతావరణం.. అటు ఎండ, ఇటు వాన

AP Weather Update: ఏపీలో విచిత్ర వాతావరణం.. అటు ఎండ, ఇటు వాన
Advertisement

AP Weather Update: ఏపీలో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది, కొన్ని ప్రాంతాల్లో ఎండలు కాగా, మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు, నైరుతి బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

బంగాళఖాతం, అరేబియా సముద్రం వైపు నుండి తేమగాలులు వీస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖవారు హెచ్చరిస్తున్నారు. బుధవారం అనకాపల్లి(D) మాడుగుల 39.4°C, వైఎస్సార్(D) దువ్వూరులో 38.9°C, నంద్యాల జిల్లా కొత్తపల్లిలో 38.7°C, ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో 38.6°C, పల్నాడు జిల్లా అమరావతి, పార్వతీపురంమన్యం జియ్యమ్మవలసలో 38.3°C, అన్నమయ్య జిల్లా వతలూరులో 38.2°C, గుంటూరు జిల్లా తాడేపల్లి, విజయనగరం జిల్లా నెలివాడ 38.1°C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisement

అలాగే గురువారం అల్లూరిసీతారామరాజు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాల్లో వడగాలులు ప్రభావం, పిడుగులతో కూడిన వర్షం కూరిసేందుకు అవకాశం ఉంది.

Also Read: రజినికి చుక్కెదురు.. ఇక జైలుకేనా?

Advertisement

మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి, ప్రజలు తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటకు రావాలని, లేదంటే ఇంట్లోనే ఉండాలని చేప్తున్నారు. వేడిగాలి నుండి తల, చెవులను కాపాడుకోవాలి. అలాగే శరీరం డీహ్రైడేట్ కాకుండా ఉండటానికి ORS, ఇంట్లో తయారుచేసిన పానీయీలు త్రాగాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×