E-Paper
Advertisement

AP Weather: హై అలర్ట్.. ఏపీలో వడగాలుల బీభత్సం.. పిడుగులతో కూడిన వర్షాలు!

AP Weather: హై అలర్ట్.. ఏపీలో వడగాలుల బీభత్సం.. పిడుగులతో కూడిన వర్షాలు!
Advertisement

AP Weather: ఏపీ ప్రజలకు అటు ఎండలు, ఇటు అకాల వర్షాలతో మిశ్రమ వాతావరణం ఎదురుకానుంది. దీనికి సంబంధించి విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భానుడి భగభగలు కొనసాగనున్నాయి. అల్లూరి సీతారామరాజు, పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఎన్టీఆర్, అనంతపురం జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరోవైపు, వడగాలులతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్ష సూచన కూడా ఉండటం గమనార్హం. ప్రస్తుతం బంగాళాఖాతంలోని అల్పపీడన కేంద్రం నుంచి తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మహారాష్ట్ర వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడనుంది.

Advertisement

ముఖ్యంగా రేపు అల్లూరి, పోలవరం ప్రాంతాలతో పాటు రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల దగ్గర గానీ ఉండకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండలు, వర్షాల నేపథ్యంలో రైతులు తమ పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

Also Read: ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక మలుపు.. కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు సమన్లు

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×