// // CM Chandrababu: పల్లె వెలుగులో అయినా ఏసీ ఉండాల్సిందే.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు -->
E-Paper
Advertisement

CM Chandrababu: పల్లె వెలుగు బస్సులో అయినా ఏసీ ఉండాల్సిందే.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu: పల్లె వెలుగు బస్సులో అయినా ఏసీ ఉండాల్సిందే.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) ఆధునికతపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో.. ఇకపై ప్రవేశపెట్టే కొత్త బస్సులన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు చేరువయ్యే పల్లెవెలుగు సర్వీసుల్లో కూడా ఏసీ సౌకర్యం తప్పనిసరి చేయాలని ఆయన సూచించడం విశేషం.

సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఆర్టీసీ రోడ్ మ్యాప్‌ను పరిశీలించారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1,450 ఎలక్ట్రిక్ బస్సులను (EVs) కొనుగోలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పల్లెవెలుగు బస్సులంటే కేవలం సాధారణ ప్రయాణ సాధనాలుగా కాకుండా, సామాన్యులకు కూడా చల్లని ప్రయాణ అనుభూతిని అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో రవాణా నాణ్యత పెరుగుతుందని ఆయన ఆకాంక్షించారు.

Advertisement

మరోవైపు, త్వరలో రానున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం దృష్టి సారించారు. గోదావరి జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పుష్కరాల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, పర్యావరణ హితమైన రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని చెప్పారు. ఈ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు ఎలక్ట్రిక్ బస్సులు దోహదపడతాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. డీజిల్ ఖర్చులను తగ్గించుకుని, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లడం ద్వారా అటు పర్యావరణానికి, ఇటు సంస్థ ఆర్థిక పరిస్థితికి మేలు జరుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో రవాణా శాఖ ఉన్నతాధికారులు ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Advertisement

ALSO READ: Rajam constituency: టీడీపీలో పొలిటికల్ ఫైట్.. రాజాంకి గ్రీష్మే దిక్కా?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×