// //

Amanchi KrishnaMohan Resigns to YCP: ఎన్నికల వేళ వైసీపీకి మరో షాక్ తగిలింది. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నెల 9వ తేదీన ప్రజల సమక్షంలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.
పర్చూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహించిన కృష్ణమోహన్‌కు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన గత కొంత కాలంగా వైసీపీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి చీరాల ఎమ్మెల్యేగా గెల్చిన ఆమంచి.. 2014లో తన సొంత పార్టీ నవోదయం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీలో తన పార్టీని టీడీపిలో విలీనం చేశారు. 2019లో వైసీపీలో చేరి చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి కూడా టికెట్ దక్కకపోవడంతో ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.