E-Paper
Advertisement

AP Political: రోజాకు సిగ్గుండాలి.. తల్లి, చెల్లి బంధాల విలువ తెలియని జగన్.. మంత్రి సంధ్యారాణి ఫైర్

AP Political: రోజాకు సిగ్గుండాలి.. తల్లి, చెల్లి బంధాల విలువ తెలియని జగన్.. మంత్రి సంధ్యారాణి ఫైర్
Advertisement

– 74 మంది మహిళలకు అన్యాయం జరిగిందా?
– ఏదీ, ఏడుగురి పేర్లు చెప్పు చూద్దాం
– నోటికొచ్చింది మాట్లాడడానికి సిగ్గుండాలి
– ఐదేళ్లు ఒక్క ఆడపిల్లకైనా రక్షణ ఇచ్చారా?
– జగన్, రోజాపై మంత్రి సంధ్యారాణి ఫైర్

పార్వతీపురం, స్వేచ్ఛ: AP Political: మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. శనివారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, జగన్‌పై ఫైరయ్యారు. ఆస్తి కోసం సొంత తల్లిని, చెల్లిని కోర్టులో పెట్టిన జగన్ మనిషేనా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తండ్రి వైఎస్ పోటీ చేసిన టైమ్‌లో సొంత ఇల్లు కూడా లేదు, అలాంటిది అన్ని ఆస్తులు జగన్ ఏ విధంగా సంపాదించారని ప్రశ్నించారు. ఒకప్పుడు ఇళ్లు కూడా లేని రాజశేఖర్‌రెడ్డి కుమారుడికి ఇప్పుడు ఇన్ని ఇళ్లు ఎలా వచ్చాయని అడిగారు.

Advertisement

జగన్ ఇంత ఆస్తి ఎలా వచ్చింది, రాళ్లు కొట్టి సంపాదించారా అంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఉన్న వారందరూ అక్క చెల్లెమ్మలే అని చెప్పుకునే జగన్, సొంత తల్లిని బయటకు తోసేసి, చెల్లికి కోర్టుకు లాగారంటూ విమర్శించారు. ఇంత చేసి, చంద్రబాబు, లోకేష్ గురించి ఎలా మాట్లాడతారని మండిపడ్డారు. కరోనా సమయంలో జనాన్ని పలకరించని జగన్, మొన్న గుర్లలో కేవలం రాజకీయ లబ్ధి కోసం పలకరింపులు చేశారని అన్నారు మంత్రి సంధ్యారాణి. ఇక, రోజా వ్యాఖ్యలపై స్పందిస్తూ, 74 మంది మహిళలకు అన్యాయం జరిగిందని చెప్పిన రోజా, కనీసం ఏడుగురు పేర్లు అయినా చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read: CM Chandrababu: మద్యం ప్రియులకు సూపర్ ఛాన్స్.. అలా చేస్తే ప్రశ్నించండి.. లేదా ఫిర్యాదు చేయండి: సీఎం చంద్రబాబు

Advertisement

రోజా అలా మాట్లాడేందుకు సిగ్గుండాలని మండిపడ్డారు. ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఒక్క ఆడపిల్లకు కూడా మీరు రక్షణ కల్పించలేకపోయారని ఆరోపించారు. ఏదైనా సంఘటన జరిగితే చంద్రబాబు ఆదేశాల మేరకు శాఖల పరమైన మంత్రులే నేరుగా వెళ్తున్నారని వివరించారు. ప్రజలు మిమ్మల్ని ఛీ కోట్టారన్న విషయం మర్చిపోవద్దని, ఇంకా ఛీ కొట్టించుకోవాలని తాపత్రయపడొద్దని చురకలంటించారు. వరద బాధితులకు కోటి రూపాయలు ప్రకటించిన జగన్, ఇంతవరకు ఆ చెక్కు పంపిణీ చేయలేదన్నారు మంత్రి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×