E-Paper
Advertisement

Anagani Responded on Madanapalle Incident : మదనపల్లె ఘటన విషయంలో పెద్దిరెడ్డిపైనే అనుమానంగా ఉంది: మంత్రి అనగాని

Anagani Responded on Madanapalle Incident : మదనపల్లె ఘటన విషయంలో పెద్దిరెడ్డిపైనే అనుమానంగా ఉంది: మంత్రి అనగాని
Advertisement

Anagani Resonded on Madanapalle Incident: ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంపై ఆయన మాట్లాడారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందున్నారు. అగ్నిప్రమాదానికి సంబంధించి పెద్దిరెడ్డి, స్థానిక వైసీపీ నేతలపైనే అనుమానం ఉందని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆర్డీవో, ఎమ్మార్వో, ఉద్యోగుల ఫోన్లను సీజ్ చేసినట్లు చెప్పారు. అన్ని రెవెన్యూ ఆఫీసుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అనగాని వెల్లడించారు.

‘పెద్దిరెడ్డి అవినీతిని కప్పిపుచ్చేందుకు ఈ ఘటన జరిగి ఉండొచ్చు అనే అనుమానాలు కలుగుతున్నాయి. పెద్దిరెడ్డి రూ. 1000 కోట్ల అవినీతి వెలుగులోకి వచ్చిన క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొన్నటివరకు సబ్ కలెక్టరేట్ ఆయన నియంత్రణలోనే ఉండేది. నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున ల్యాండ్ కన్వర్షన్ జరిగింది. ఈ విషయమై ఎమ్మెల్యే షాజహాన్ ప్రశ్నించగానే ఈ ఘటన జరిగింది. ఆదివారం రోజు ఉద్యోగులు పనిచేయడం ఎందుకు.? ఉద్యోగులు సక్రమంగా పనిచేయలేకపోతే పక్కకు తప్పుకోవాలి. గత ప్రభుత్వం అవినీతిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తే చర్యలు తప్పవు’ అంటూ మంత్రి హెచ్చరించారు.

Advertisement

Also Read: ఇంతకీ నీ భర్త ఎవరో చెప్పు.. శాంతికి దేవాదాయశాఖ నోటీసులు

కాగా, ఆదివారం అర్ధరాత్రి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విలువైన రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. దీంతో డీజీపీ ద్వారకా తిరుమలరావు మదనపల్లెకు చేరుకుని సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు. డీజీపీతోపాటు సీఐడీ చీఫ్ రవిశంకర్ కూడా సంఘటనాస్థలికి వెళ్లారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×