E-Paper
Advertisement

AP Housing Site Application: ఏపీలో ఇళ్ల స్థలాల దరఖాస్తు గడువు పెంపు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

AP Housing Site Application: ఏపీలో ఇళ్ల స్థలాల దరఖాస్తు గడువు పెంపు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Advertisement

AP Housing Site Application: ఏపీలో ఇళ్ల స్థలాల దరఖాస్తు గడువు పెంపు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
AP Housing Site Application: పీఎం ఆవాస్ యోజన (గ్రామీణ) పథకం కింద ఇళ్ల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేస్తున్నాయి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువును రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం మరో రెండు వారాలు గడువు పొడిగించింది. ప్రజల నుంచి వస్తున్న వినతులు, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈనెల 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఈ పథకం ద్వారా అర్హులైన వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 1.50 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. లక్ష కలిపి మొత్తం రూ. 2.50 లక్షల సహాయం చేస్తుంది. అర్హులైన వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత స్థలం లేని వారికి 3 సెంట్ల స్థలం, ఆర్థికసాయం చేయనున్నారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు సొంత ఇంటి కల నెరవేరనుంది. ఈ పథకం కింద అర్హులను ఎంపిక చేసేందుకు ప్రతి గ్రామంలో సర్వే బృందాలను నియమించి, అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రతి గ్రామంలో సర్వే బృందాలు అర్హులను గుర్తించే పనిని చురుగ్గా చేస్తున్నాయి. గ్రామాల్లో ఇల్లు లేని వారి వివరాలను ఆవాస్‌ ప్లస్‌ 2024 అనే ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. లబ్ధిదారుల ఇంటి వద్దే వారి ఫేసియల్, బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్లు మంజూరు అయినా, ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో బిల్లులు రాలేదు. దీంతో కూటమి సర్కారు ఆ ఇళ్లను పూర్తి చేసేందుకు బాధ్యత తీసుకుంది. అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు అదనంగా ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించింది. సొంత స్థలం ఉండి, ఇళ్లు లేని వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు. దరఖాస్తు గడువును నవంబర్ 30 వరకు, తాజాగా డిసెంబర్ 14 వరకు పొడిగించారు.

పీఎం ఆవాస్ యోజన అర్హతలు, దరఖాస్తు విధానం

అర్హతలు

దరఖాస్తుదారునికి దేశవ్యాప్తంగా ఎక్కడా పక్కా ఇల్లు కలిగి ఉండకూడదు
సొంత స్థలం తప్పనిసరిగా ఉండాలి.
కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు.
ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలి.

అవసరమయ్యే సర్టిఫికెట్లు

  • దరఖాస్తుదారుడు, కుటుంబ సభ్యులుందరి ఆధార్ కార్డులు.
  • రేషన్ కార్డు
  • ఇంటి పట్టా లేదా స్థలం రిజిస్ట్రేషన్ కాపీ
  • బ్యాంకు పాస్‌బుక్
  • జాబ్ కార్డు
  • ఖాళీ స్థలం, లబ్ధిదారుడి ఫొటో

దరఖాస్తు విధానం

Advertisement

గ్రామ, వార్డు సచివాలయం పంచాయతీ కార్యదర్శి లేదా డిజిటల్ అసిస్టెంట్ ను కలవాలి.
లబ్దిదారుడి వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలి.
అధికారులు ఆవాస్ ఫ్లస్ ద్వారా దరఖాస్తుదారుడి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.
అధికారులు పాత ఇల్లు లేదని, సొంత స్థలం ఉందని నిర్ధారించుకుని ఫొటోను అప్లోడ్ చేస్తారు.
అర్హుల వారి జాబితాను విడుదల చేస్తారు.
చివరిగా నిధుల విడుదల

ఇంటి స్థలం కోసం దరఖాస్తులు

అర్హులైన లబ్దిదారులు గ్రామ వీఆర్వో లేదా డిజిటల్ అసిస్టెంట్ సంప్రదించాలి.
దరఖాస్తు ఫారమ్ తో పాటు సంబంధిత పత్రాలు సమర్పించాలి.

Also Read: AP Govt Holidays List 2026: కొత్త ఏడాది ఏపీ పబ్లిక్ హాలిడేస్ లిస్ట్ వచ్చేసింది.. ఆదివారం వచ్చిన పండుగలివే?

కావాల్సిన పత్రాలు

  • కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు
  • రేషన్ కార్డు
  • ప్రస్తుతం ఉంటున్న ఇంటి పన్ను, పైపు పన్ను,
  • కరెంట్ బిల్లు
  • భర్త లేదా భార్యతో కలిసి దిగిన తాజా ఫొటో

వివరాలను ఆన్ లైన్ చేయించుకోవాలి. అనంతరం వీఆర్వో, తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్లు ఆమోదం తెలిపితే ఇంటి స్థలం గ్రాంట్ అవుతుంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×