E-Paper
Advertisement

AP Highcourt : జగన్ సర్కార్ కు షాక్.. R-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే..

AP Highcourt : జగన్ సర్కార్ కు షాక్.. R-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే..
Advertisement

AP Highcourt : అమరావతి ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్టే ఇచ్చింది. రాజధానేతర ప్రాంత ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 1402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేసింది. ఈ మేరకు జీవోలు ఇచ్చింది. లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసింది. ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి ఇటీవల సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు.

ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణ ప్రక్రియను సవాలు చేస్తూ అమరావతి ప్రాంత రైతు సంక్షేమ సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ ఐక్య కార్యాచరణ సమితి హైకోర్టులో పిటిషన్లు వేశాయి. ఈ పిటిషన్లపై జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అమరావతి ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేయాలని తీర్పు నిచ్చింది.

Advertisement

హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు విధించిన స్టేను తొలగించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×