E-Paper
Advertisement

HC ON SAJJALA : సజ్జల పిటిషన్‌పై హైకోర్టు కీలక నిర్ణయం, కేసు చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదిలీ

HC ON SAJJALA : సజ్జల పిటిషన్‌పై హైకోర్టు కీలక నిర్ణయం, కేసు చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదిలీ
Advertisement

HC ON SAJJALA : లుక్‌ ఔట్‌ నోటీసు రద్దు చేయాలని సజ్జల దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేసును చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వైసీపీ కీలక నేత, సజ్జల రామకృష్ణారెడ్డి LOC (Look out circular) పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, విచారణను సీజే (CHIEF JUSTICE) బెంచ్‌కు బదిలీ చేయాలని న్యాయమూర్తి రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

ఎస్పీ లుక్ అవుట్ నోటీస్…

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ పార్టీ ప్రధాన కారదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై మంగళగిరి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి సజ్జలపై గుంటూరు ఎస్పీ లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు.

Advertisement

2021 అక్టోబర్ 19న దాడి… 

సీఎంగా జగన్ అధికారంలో ఉన్న కాలంలో 2021 అక్టోబర్‌ 19న వైసీపీకి చెందిన పలువురు కార్యకర్తలు, నేతలు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పూనుకున్నారు. పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో తొలుత సజ్జల పేరు బయటకు రాలేదు.

తర్వాత విచారణలో భాగంగా రామకృష్ణారెడ్డి ప్రమేయం కూడా ఉందని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ఈ క్రమంలోనే ఆయన విదేశాలకు వెళ్లకుండా పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్‌, తలశిల రఘురామ్‌ను ఇప్పటికే పలుమార్లు పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.

Also Read : ఆ ఒక్క ట్వీట్ తో మనసు దోచేసిన సీఎం రేవంత్.. అసలు ఆ ట్వీట్ లో ఏముందంటే?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×