E-Paper
Advertisement

AP Helicopter Politics: జగన్ విహారయాత్రకు రూ.222 కోట్ల ఖర్చు.. నిజం బయటపడిందంటూ మంత్రి లోకేష్ కౌంటర్

AP Helicopter Politics: జగన్ విహారయాత్రకు రూ.222 కోట్ల ఖర్చు.. నిజం బయటపడిందంటూ మంత్రి లోకేష్ కౌంటర్
Advertisement

AP Helicopter Politics: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పదవీకాలంలో విమాన ప్రయాణాలకు రాష్ట్ర ఖజానా నుండి రూ.222 కోట్లు డ్రా అయ్యాయని టీడీపీ ఆరోపిస్తుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ విమానాల్లోనే ప్రయాణాలు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. దీంతో చార్టర్డ్ హెలికాఫ్టర్ ప్రయాణాలపై ఏపీలో కొత్త రాజకీయం మొదలైంది. మంత్రి నారా లోకేష్ తరచుగా హైదరాబాద్‌కు విమాన ప్రయాణాలు చేస్తూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపించడంతో వివాదం మొదలైంది.

77 ప్రయాణాలకు సొంత నిధులే

కొడమల సురేష్ బాబు దాఖలు చేసిన ఆర్టీఐలో మంత్రి లోకేష్ విమాన ప్రయాణాలకు శాఖాపరంగా ఎలాంటి ఖర్చులు చెల్లించలేదని ప్రభుత్వం తెలిపింది. ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, సమాచార సాంకేతికత, రియల్-టైమ్ గవర్నెన్స్ శాఖలు కలిగిన మంత్రి లోకేష్ తన సొంత డబ్బులతోనే 77సార్లు హైదరాబాద్ కు ప్రయాణించారని ఆర్టీఐ స్పష్టం చేసింది. దీంతో వైసీపీ చేసిన ఆరోపణలకు టీడీపీ చెక్ పెట్టినట్లు అయింది. అలాగే జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విమాన ప్రయాణ ఖర్చులు విడుదల చేసింది టీడీపీ.

ఏపీ ఏవియేషన్ లెక్కలు ఇలా

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ లెక్కల ప్రకారం 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్ విమాన ప్రయాణానికి రూ. 222.85 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని తేలింది. 2019-20లో రూ. 31.43 కోట్లు, 2020-21లో రూ. 44 కోట్లు, 2021-22లో రూ. 49.45 కోట్లు, 2022-23లో రూ. 47.18 కోట్లు మరియు 2023-24లో రూ. 50.81 కోట్లు ఖర్చు చేశారు. ఫిక్స్‌డ్-వింగ్ విమానాల కోసం రూ. 112.50 కోట్లు, హెలికాప్టర్ ఛార్జీల కోసం రూ. 87.02 కోట్లు, సిబ్బంది, నిర్వహణ వంటి నిర్వహణ ఖర్చుల కోసం రూ. 23.31 కోట్లు ఖర్చు చేసినట్లు గణాంకాలు స్పష్టం చేశాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో అధికారిక పర్యటనలన్నింటికీ మంత్రి లోకేష్ తన వ్యక్తిగత నిధులను ఉపయోగించుకున్నారని టీడీపీ తెలిపింది. జగన్ ఐదు సంవత్సరాల పాలనలో విమాన ప్రయాణానికి రాష్ట్ర ఖజానా నుండి రూ.222 కోట్లు తీసుకున్నారని టీడీపీ సోషల్ మీడియాలో విమర్శలు చేసింది.

18 నెలల్లో లోకేశ్ ‘సున్న’ ఖర్చు

Advertisement

“మంత్రిగా ఉన్న 18 నెలల్లో, నారా లోకేష్ తన పర్యటనలకు ఉపయోగించే హెలికాప్టర్లు/ప్రత్యేక విమానాల కోసం ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ముఖ్యమంత్రిగా 60 నెలల్లో, జగన్ తన పర్యటనలకు ఉపయోగించే హెలికాప్టర్లు/ప్రత్యేక విమానాల కోసం ప్రభుత్వ ఖజానా నుండి రూ.222 కోట్లు ఖర్చు చేశారు” అని టీడీపీ సోషల్ మీడియాలో పేర్కొంది.

Also Read: Ap Liquor Case: సీఎం చంద్రబాబుకు ఉపశమనం.. లిక్కర్ కేసు మూసివేత!

ఈ విషయంపై మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ… ‘ప్రజలు ఉద్యోగాలు, సౌకర్యాల కోసం కష్టపడుతున్నప్పుడు, వారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక రాజభవనానికి రూ.500 కోట్లు, విహారయాత్రకు రూ.222 కోట్లు ఖర్చు చేశారు. చివరకు నిజం బయటపడింది’ అని అన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×