// // AP Heavy Rains: తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. ప్రజలు బయటకు రావొద్దు -->
E-Paper
Advertisement

AP Heavy Rains: తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. ప్రజలు బయటకు రావొద్దు

AP Heavy Rains: తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. ప్రజలు బయటకు రావొద్దు
Advertisement

AP Heavy Rains: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో ఉత్తర-వాయువ్య దిశగా గంటకు 18 కి.మీ వేగంతో వాయుగుండం కదిలిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గురువారం రాత్రి లేదా రేపు ఉదయం గోపాల్‌పూర్‌కు దగ్గరగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందన్నారు.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం ఉదయం 8.30 గంటలకు తీవ్ర వాయుగుండంగా మారిందని విశాఖ తుపాన్ హెచ్చరిక కేంద్రం అధికారి సీహెచ్ నాగభూషణం తెలిపారు. ప్రస్తుతం తీవ్ర వాయుగుండం ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణిస్తోందన్నారు. విశాఖకు దక్షిణ-ఆగ్నేయ దిశలో ఇది కేంద్రీకృతమైందని తెలిపారు.

ఆంధ్ర-ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం

Advertisement

‘గురువారం రాత్రి లేదా రేపు ఉదయం పారాదీప్–గోపాలపూర్ మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు మూడు రోజుల పాటు వేటకు వెళ్లకూడదు. తీరం వెంబడి ఉన్న అన్ని పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ నుంచి అతిభారీ వర్ష సూచన ఉంది’ అని సీహెచ్ నాగభూషణం తెలిపారు.

ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్

శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేశారు. అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరంలో ఫ్లాష్ ఫ్లడ్స్ ఆస్కారం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉత్తరాంధ్ర తీరం వెంబడి 55-75 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రయాణాలు మానుకోవాలని, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించింది.

Advertisement

ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు,హోర్డింగ్స్ వద్ద ఉండరాదని అధికారులు సూచించారు. అత్యవసర సహాయం కోసం APSDMA టోల్ ఫ్రీ నెంబర్లు112,1070, 18004250101 సంప్రదించాలన్నారు.

నదుల్లో వరద ప్రవాహం

‘వంశధార, నాగావళి నదులకు వరద ప్రవాహం స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. కృష్ణా నది ప్రవాహం ప్రకాశం బ్యారేజీ వద్ద 3.76 లక్షల క్యూసెక్కులు, గోదావరి నది ప్రవాహం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 10.82 క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదీపరీవాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించారు.

భారీ వర్షాలపై సీఎం సమీక్ష

వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీవర్షాలు, ఈదురుగాలులు, వరద ముప్పుపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని సీఎం ఆదేశించారు.

Also Read: Visakha Heavy Rains: వాయుగుండం ఎఫెక్ట్.. విశాఖలో భారీ వర్షాలు, గాలుల బీభత్సం

కొన్ని ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ సమాచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలని నిర్దేశించారు. కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు సేవలు అందిస్తూ, అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు బృందాలు సిద్ధంగా ఉండాలని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మంత్రులు, విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితులను పరిశీలిస్తూ ఉండాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×