E-Paper
Advertisement

ESMA Act : ఏపీలో అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం.. 6 నెలలపాటు సమ్మెలు నిషేధం..

ESMA Act : ఏపీలో అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం.. 6 నెలలపాటు సమ్మెలు నిషేధం..
Advertisement

ESMA Act : ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఏపీలో అంగన్‌వాడీలు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో చలనం రాకపోడవంతో నిరసనలు తీవ్రం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించింది. సమ్మెను నిషేధిస్తూ జీవో జారీ చేసింది.

అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సేవలను అత్యవసర సర్వీసుల కిందకు ప్రభుత్వం తీసుకొచ్చింది. చిన్న పిల్లలు, బాలింతలు తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది. 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

అంగన్‌వాడీలతో పలు మార్లు ప్రభుత్వం చర్చలు జరిపినా ఫలించలేదు. దీంతో అంగన్‌వాడీల సమ్మె కొనసాగుతోంది. అంగన్‌వాడీల బాధ్యతలను ప్రభుత్వం తాత్కాలికంగా వార్డు వాలంటీర్లకు, సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది.

ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై అంగన్వాడీ కార్యకర్తలు మండిపడుతున్నారు. బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టంచేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని ప్రకటించారు.

Advertisement

26 రోజులుగా అంగన్ వాడీలు నిరసనలు చేస్తున్నారు. వారిపై ఏపీ ప్రభుత్వం శనివారం ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. వీరిని అత్యవసర సర్వీసుల కిందకి తీసుకొచ్చింది. జీవో నెంబర్‌ 2ను జారీ చేసింది. 6 నెలలపాటు సమ్మెలు, నిరసనలు నిషేధించింది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×