E-Paper
Advertisement

ఏపీలో రూ.5 వేలకే ఎలక్ట్రిక్ సైకిల్.. రూ.11 వేల రాయితీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

ఏపీలో రూ.5 వేలకే ఎలక్ట్రిక్ సైకిల్.. రూ.11 వేల రాయితీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Advertisement

AP Govt e-Cycle Scheme: ఏపీ ప్రభుత్వం ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇందులో భాగంగా కేవలం రూ. 5,000 డౌ పేమెంట్ తో ఎలక్ట్రిక్ సైకిళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈవీ సైకిళ్లపై రూ. 11,000 సబ్సిడీ అందిస్తుంది. వీటి కోసం స్థానిక గ్రామ లేదా వార్డు సచివాలయం లేదా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA)లో నమోదు చేసుకోవాలి. ప్రస్తుతం కుప్పం, కృష్ణా జిల్లాలో ఈ స్కీమ్ అమలు చేస్తున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు.

ఈ ఎలక్ట్రిక్ సైకిల్ అసలు విలువ రూ. 23,999. లబ్ధిదారులు ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. ముందుగా రూ.5000 డౌన్ పేమెంట్ చెల్లిస్తే సరిపోతుంది. రూ.11 వేల రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని 24 నెలల పాటు సులభ వాయిదాలలో చెల్లించవచ్చు. ఈ మొత్తాన్ని బ్యాంక్ నుంచి లోన్ గా తీసుకోవచ్చు.

దరఖాస్తు విధానం ఇలా?

  • స్థానిక గ్రామ లేదా వార్డు సచివాలయం లేదా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA) అధికారులను సంప్రదించాలి.
  • అధికారులు ఇచ్చిన రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూర్తి చేయాలి.
  • దరఖాస్తు కోసం.. నివాస ధ్రువీకరణ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, బ్యాంకు అకౌంట్ వివరాలు అందించాలి.
  • డౌన్ పేమెంట్ రూ.5,000 చెల్లించండి.
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత, 60 రోజులలోపు ఎలక్ట్రిక్ సైకిల్ డెలివరీ చేస్తారు.
Advertisement

కుప్పంలో 5000, కృష్ణా జిల్లాలో 500 ఈవీ సైకిళ్లు మొదటి విడతలో అందిస్తారు. ఈవీ సైకిళ్లు.. సాధారణంగా 250W BLDC సామర్థ్యం ఉన్న మోటార్ బైక్‌లు, ఇవి 40-60 కి.మీ.ల రేంజ్‌ను కలిగి ఉంటాయి. రోజువారీ ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎలక్ట్రిక్ సైకిళ్లకు అప్లై చేసుకోవచ్చు.

Also Read: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. 90% సబ్సిడీతో స్వయం ఉపాధి పథకాలు.. అప్లై చేసుకోండిలా!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×