E-Paper
Advertisement

AP Govt Transfers: ఏపీలో భారీగా మున్సిపల్ కమిషనర్లు బదిలీ.. కొత్త పోస్టింగ్ లు వీరికే

AP Govt Transfers: ఏపీలో భారీగా మున్సిపల్ కమిషనర్లు బదిలీ.. కొత్త పోస్టింగ్ లు వీరికే
Advertisement

AP Govt Transfers: ఆంధ్రప్రదేశ్ లో పలువురు మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. మొత్తం 11 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక పరిపాలనా మార్పుల్లో భాగంగా బదిలీలు జరిగాయని ప్రభుత్వం తెలిపింది. వివిధ పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న 11 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసి, వారికి కొత్త పోస్టింగ్‌లు కల్పిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీల అయిన అధికారులు వీళ్లే

పార్వతీపురం మున్సిపల్ కమిషనర్‌గా డి. పావని నియమితులయ్యారు. అనంతపురం మున్సిపల్ డిప్యూటీ కమిషనర్‌గా ఎం. అంజయ్యను నియమించారు.
తిరుపతి అదనపు మున్సిపల్ కమిషనర్‌గా యు. శారదాదేవి నియమితులయ్యారు. పెడన మున్సిపల్ కమిషనర్‌గా డి. కొండయ్య, ప్రొద్దుటూరు మున్సిపల్ సహాయ కమిషనర్‌గా ఎం. మంజునాథ్ గౌడ్‌ నియమితులయ్యారు. చీరాల మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న అబ్దుల్ రషీద్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది.
ఆయన స్థానంలో డేనియల్ జోషెఫ్‌ను నియమించింది.

Advertisement

నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ ఎస్. బేబీని మత్స్యశాఖ రెవెన్యూ విభాగానికి బదిలీ చేసింది. నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్‌గా జి. వెంకటరామిరెడ్డిని నియమించింది. కనిగిరి మున్సిపల్ కమిషనర్‌గా పి. శ్రీధర్‌ను నియమించగా.. ప్రస్తుత మున్సిపల్ కమిషనర్‌ పి. కృష్ణమోహన్ రెడ్డిని జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

Also Read: Rappa Rappa Politics: రప్పా.. రప్పా.. రాజే అలా ఉంటే, అనుచరులు ఇంకెలా ఉంటారు?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×