E-Paper
Advertisement

Social Media: సోషల్ మీడియా వ్యవహారం.. బ్యాన్ చేసే అవకాశం, మంత్రుల టీమ్ భేటీ

Social Media: సోషల్ మీడియా వ్యవహారం..  బ్యాన్ చేసే అవకాశం, మంత్రుల టీమ్ భేటీ
Advertisement

Social Media: సోషల్ మీడియాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుంది. అందుకోసం మంత్రి లోకేష్‌ ఆధ్వర్యంలో మంత్రుల బృందం సమావేశం కానుంది. ఈ సమావేశంలో సోషల్ మీడియా వ్యవహారంపై క్లారిటీ వచ్చే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసలు సోషల్ మీడియా వ్యవహారం ఏంటని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.

సోషల్ మీడియాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం?

Advertisement

రాష్ట్రంలో 13 ఏళ్ల పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు ఓ ప్రకటన చేశారు. దీనిపై మూడు నెలల్లో విధివిధానాలను ఖరారు చేస్తామని వెల్లడించారు. దీనివల్ల పిల్లలకు నష్టం జరగకూడదన్నది తమ ఆలోచనగా చెప్పుకొచచారు.

13 నుంచి 16 ఏళ్ల వయసువారు సోషల్ మీడియా వాడకంపై నిర్ణయం తీసుకుంటామని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో మంత్రుల బృందం సమావేశం కానుంది. ఈ సమావేశంలో సోషల్ మీడియాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తొలుత చిన్నారులపై ఉపయోగించకుండా సోషల్ మీడియా ను నిషేధించాలనే అభిప్రాయాన్ని బయటపెట్టారు.

Advertisement

​16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేసే దిశగా కసరత్తు

ఆ తర్వాత కర్ణాటక, గోవాలు వేగంగా అడుగులు వేశాయి. ఈ విషయమై కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య కూడా అసెంబ్లీలో సోషల్ మీడియాను నిషేధించే అంశంపై ప్రకటన చేశారు. పిల్లలపై సోషల్ మీడియా దుష్ప్రభావం నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసెంబ్లీలో చెప్పిన విషయం తెల్సిందే.

పిల్లలు మొబైల్‌ వినియోగం వల్ల తలెత్తుతున్న ప్రతికూల భావాలను నివారించడానికే ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. గతేడాది ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించడంపై నిషేధం విధించింది. దాని తర్వాత మిగతా దేశాలు అదే దారిలో వెళ్తున్నాయి.

ALSO READ: ఏయూ మెగా కల్చరల్ ఫెస్ట్‌లో డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు.. తనకు అర్హత లేదని వ్యాఖ్య 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×