E-Paper
Advertisement

AP Free Electricity Scheme: వారికి ఉచిత విద్యుత్.. కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం!

AP Free Electricity Scheme: వారికి ఉచిత విద్యుత్.. కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం!
Advertisement

AP Free Electricity Scheme: ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీని నెరవేరుస్తూ, నేతన్నల చిరకాల కోరికైన ఉచిత విద్యుత్ పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చజెండా ఊపారు. ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ పథకం అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది నేతన్నల కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండనున్నాయి.

నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. దీనివల్ల సుమారు 93,000 కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరనుంది. నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. దీని ద్వారా 10,534 కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ. 190 కోట్ల అదనపు భారాన్ని భరించనుంది.

Advertisement

గత కొన్నేళ్లుగా విద్యుత్ ఛార్జీల భారంతో కునారిల్లుతున్న చేనేత రంగానికి ఈ పథకం గొప్ప ఊపిరి పోయనుంది. కేవలం ఉచిత విద్యుత్తు మాత్రమే కాకుండా, చేనేత వస్త్రాలపై జీఎస్టీ (GST) భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని, అలాగే నేతన్న భరోసా కింద ఏటా రూ. 25,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వృత్తిని నమ్ముకున్న నేతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ అడుగులు వేస్తోంది.

Read Also: Pawan Kalyan: తల్లి అంజనా దేవి పుట్టినరోజు .. గొప్ప మనసు చాటుకున్న పవన్!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×