E-Paper
Advertisement

AP Government: ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ సీఆర్డీఏ గెజిట్

AP Government: ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ సీఆర్డీఏ గెజిట్
Advertisement

AP Government: అమరావతి రాజధాని పరిధిలో భవనాల నిర్మాణాలపై ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ సీఆర్డీఏ గెజిట్ జారీ చేసింది. దీంతో అమరావతిలో ప్రభుత్వ భవనాలు నిర్మించనున్నారు.

భవనాల సముదాయ నిర్మాణం కోసం 1575 ఎకరాల భూమిని నోటీఫై చేస్తూ గెజిట్ విడుదలైంది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, అధికారులు, ప్రజాప్రతినిధుల క్వార్టర్స్, భవనాలకు కేటాయించిన భూమిని ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ మేరకు మాస్టార్ ప్లాన్ ప్రకారం, జోనింగ్ నిబంధనలను అనుసరించి నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

నోటిఫై చేసిన గ్రామాల భూమి వివరాలను సీఆర్డీఏ గెజిట్ లో పెట్టింది. రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు కొండమరాజు పాలెం గ్రామాల్లోని 1575 ఎకరాల భూమిని నోటిఫై చేసినట్లు సీఆర్డీఏ కమిషనర్ భాస్కర్ వెల్లడించారు. ఈనోటిఫై చేసిన ప్రాంతంలో ఇప్పటికే కొన్ని భవనాల నిర్మాణ పనులు తుదిదశలో ఉన్నాయి. రాజధాని నిర్మాణంలో తొలి విడత పనులు నోటిఫై చేసిన ప్రాంతంలోనే ప్రభుత్వ భవనాలను నిర్మించనుంది.

సీఆర్డీఏ చట్టం సెక్షన్ 39 ప్రకారం.. సీఆర్డీఏ బహిరంగ ప్రకటన జారీచేసింది. ప్రభుత్వ కంప్లెక్స్ భవనాల కోసం నోటిఫై చేస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×