E-Paper
Advertisement

Record majority by 3 candidates Nara lokesh Ganta and Palla: ఏపీలో రికార్డు మెజార్టీ, బాబు, జగన్, పవన్‌ను మించి..

Record majority by 3 candidates Nara lokesh Ganta and Palla: ఏపీలో రికార్డు మెజార్టీ, బాబు, జగన్, పవన్‌ను మించి..
Advertisement

Record majority by 3 candidates Nara lokesh, Ganta, Palla: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలువడ్డాయి. ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో సీట్లను టీడీపీ గెలుచుకుంది.

టీడీపీ ఒక్కటే 135 స్థానాలను గెలుచుకుంది. వీరిలో రికార్డు స్థాయి మెజార్టీ ఎవరికి వచ్చిందనేది ఏపీలో చర్చ మొదలైంది. తొలుత జగన్, చంద్రబాబు, పవన్‌కల్యాణ్.. ఈ ముగ్గురిలో ఎవరికైనా రావచ్చని భావించారు. చాలామంది బెట్టింగులు కూడా కాశారు. కానీ ఓటర్లు మాత్రం ఊహించన మెజార్టీని కట్టబెట్టారు. ఈ ముగ్గురు ఎవరోకాదు. ఒకరు గుంటూరు, మరో ఇద్దరు విశాఖ నుంచి మాత్రమే రికార్డు స్థాయి మెజార్టీ సాధించారు.

Advertisement

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి 91 వేల పైచిలుకు మెజార్టీని సాధించారు. మరొకరు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి తన శిష్యుడు అవంతి శ్రీనివాస్‌పై 92 వేల పైచిలుకు మెజార్టీని సాధించారు. అంతేకాదు భీమిలి నుంచి రెండోసారి పోటీ గెలిచి రికార్డు సృష్టించారాయన. గంటా పొలిటికల్ కెరీర్ చూస్తే ఇప్పటివరకు ప్రతీసారి ఎన్నికలకు తన నియోజకవర్గాన్ని మారుస్తూ వచ్చారు. ఈసారి మాత్రం అలా కాకుండా తొలిసారి గెలిచిన భీమిలి నుంచి ఈసారి బరిలోకి దిగారు. ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గంలో మరోసారి చేయరనే అపవాదును తొలగించారు.

ALSO READ: ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరాజయం.. జగన్ ఓటమికి కారణాలు ఇవే..!

Advertisement

మూడో వ్యక్తి గాజువాక నుంచి టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. ఏపీలో భారీ మెజార్టీ వచ్చిన అభ్యర్థి కూడా.  95 వేల పైచిలుకు మెజార్టీతో మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై విజయం సాధించారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో టీడీపీకి చెందిన ముగ్గురు నేతలు 90 వేల పైచిలుకు మెజార్టీని సాధించారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×