E-Paper
Advertisement

Raghurama Krishna Raju Dance: స్మిత పాటలో స్టెప్పులతో అదరగొట్టిన రఘురామ.. యూట్యూబ్‌లో ట్రెండింగ్

Raghurama Krishna Raju Dance: స్మిత పాటలో స్టెప్పులతో అదరగొట్టిన రఘురామ.. యూట్యూబ్‌లో ట్రెండింగ్
Advertisement

సంక్రాంతి వేడుకల సందర్భంగా.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో సంబరాలు నిర్వహించారు. భోగిమంటలు వెలిగించి వేడుకలను ప్రారంభించారు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు. ఈ సందర్భంగా విద్యార్ధులతో కలిసి కోలాటమాడారు సింగర్లు స్మిత, నోయెల్. ఈ కార్యక్రమానికి కలెక్టర్ చదలవాడ నాగవాణి హాజరయ్యారు.

Advertisement

ప్రత్యేకంగా రూపొందించిన భీమవరం బీట్ సాంగ్‌ను ఈ వేడుకల్లో లాంచ్ చేశారు. స్మిత నటించిన భీమవరం బీట్ సాంగ్‌లో రఘురామ గెస్ట్ రోల్ చేశారు. భీమవరం బీట్ సాంగ్ సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు రఘురామ కృష్ణరాజు.

కాగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ భీమవరం బీట్ సాంగ్‌ను రూపొందించారు. స్మిత, నోయల్ షాన్ కలిసి ఈ పాటకు సాహిత్యం, సంగీతం సమకూర్చి ఆలపించారు. పండగ వాతావరణం, హై ఎనర్జీ బీట్స్‌తో సాగే ఈ గ్రూవీ డ్యాన్స్ నంబర్ ప్రేక్షకులను భలే ఆకట్టుకుంటోంది. ఇందులో ఆర్ఆర్ఆర్ మూవీలోని పాపులర్ స్టెప్పులను కూడా చేర్చడం విశేషం.

Advertisement

విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ వీడియో సాంగ్‌లో స్మిత, నోయల్ డ్యాన్సులు.. ఎంతో ఉత్సాహభరితంగా ఉన్నాయి. వీరితో పాటు రఘురామకృష్ణరాజు కూడా స్టెప్పులేయడంతో ఈ సాంగ్‌కు మరింత క్రేజ్ వచ్చింది.

Also Read: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం రిప్లై

ఇక విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ సాంగ్‌కు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌‌గా నిలిచింది. లక్షల్లో వ్యూస్ వచ్చాయి. మొత్తం మీద, ఈ సంక్రాంతి పండుగకు యువతను అలరించేందుకు, మంచి ఊపునిచ్చే భీమవరం బీట్ సాంగ్.. పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీగా మారనుంది. అందులో ఏపీ డిప్యూటీ స్పీకర్ పాటలో నటించడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×