E-Paper
Advertisement

AP Deputy CM: పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్.. కీలక ఆదేశాలు

AP Deputy CM: పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్.. కీలక ఆదేశాలు
Advertisement

AP Deputy CM Pawan Kalyan has viral fever: డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ అటాక్ అయింది. ఈ మేరకు ఆయన జ్వరం,చ తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆయన ఫీవర్‌తో ఇబ్బంది పడుతూనే విజయవాడ వరదలపై సమీక్షలు నిర్వహించారు. గురువారం కూడా అస్వస్థతతోనే అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులు కూడా అస్వస్థతతో బాధపడుతున్నట్లు సమాచారం.

అయితే, జ్వరం ఉన్నప్పటికీ తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ మేరకు వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం పలు సూచనలు, సలహాలు అందించారు. ప్రస్తుతం ఆయన వైరల్ ఫీవర్ ఇంకా ఎక్కువ కావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

Advertisement

ఏపీలో నెలకొన్న భారీ వర్షాలతోపాటు ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు 12 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో పాటు బుడమేరు పొంగిపొర్లడంతో నష్టం వాటిల్లింది. అయితే దీనిపై పవన్ కల్యాణ్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. గోదావరి నదికి కూడా వరద పెరుగుతుండడంతో జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో కురిసిన ఈ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ముఖ్యంగా విజయవాడలోని బుడమేరు వాగు ప్రళయం సృష్టించింది. దీంతో లోతట్టు ప్రాంతాలకు వరద ప్రభావం ఎక్కువగా వచ్చింది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అండగా ఉంటున్నారు.

Advertisement

Also Read: ఎదురుగా ట్రైన్..వెనుక డ్యాం.. సీఎం ఎలా తప్పించుకున్నాడంటే?

అయితే, వరదల ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఎప్పటికప్పుడూ పవన్ కల్యాణ్ పర్యవేక్షిస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. గురువారం పలు కాలనీల్లో పవన్ కల్యాణ్ పర్యటించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతూనే బాధితుల యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×