E-Paper
Advertisement

AP Heavy Rains: ఏపీకి తుపాను ముప్పు.. రానున్న నాలుగు రోజులు అత్యంత భారీ వర్షాలు

AP Heavy Rains: ఏపీకి తుపాను ముప్పు.. రానున్న నాలుగు రోజులు అత్యంత భారీ వర్షాలు
Advertisement

AP Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం శనివారానికి వాయుగుండంగా బలపడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారానికి తుపానుగా బలపడుతుందని పేర్కొంది. దీంతో రానున్న నాలుగు రోజులు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

అల్పపీడనం ప్రభావంతో రేపు(శనివారం) కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

తుపాను-ఏపీ ప్రభుత్వం అలర్ట్

Advertisement

అల్పపీడనం సోమవారానికి తుపానుగా బలపడనుండటంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, ఈడీ దీపక్, అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రేపు భారీ వర్షాలు, ఎల్లుండి అతి భారీ వర్షాలు, సోమ, మంగళవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్రభావిత జిల్లాలను అలర్ట్ చేయండి

‘తుపాను తీవ్రతను అంచనా వేసి ప్రభావిత జిల్లాలని అలెర్ట్ చేయాలి. ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయండి. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారులకు, ప్రజలకు తెలియజేయాలి. సహయక చర్యలకు SDRF, NDRF బృందాలు పంపించండి. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం మరింత అలర్ట్ గా ఉండాలి. కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి 24/7 కొనసాగించాలి. విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రందించాలి’- హోంమంత్రి అనిత

Advertisement

Also Read: Weather News: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం, కాసేపట్లో కుండపోత వాన

పునరావాస కేంద్రాలు ఏర్పాటు

శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఉండే వారిని గుర్తించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. అవసరమైతే ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఎక్కడిక్కడ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆహారం అందించాలన్నారు. విరిగిన చెట్లు తొలగించడం , విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ పనులు వెంటనే జరిగేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×