E-Paper
Advertisement

AP Council Sessions 2026: మండలిలో మరోసారి గందరగోళం.. మంత్రి పయ్యావుల ఉగ్రరూపం, ఈసారి..

AP Council Sessions 2026: మండలిలో మరోసారి గందరగోళం.. మంత్రి పయ్యావుల ఉగ్రరూపం, ఈసారి..
Advertisement

AP Council Sessions 2026: ఏపీలో శాసన మండలి సమావేశాల్లో ఏడో రోజూ గందరగోళం పరిస్థితులు నెలకున్నాయి. ఈ క్రమంలో అధికార-విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. దీంతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి గమనించిన ఛైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. శుక్రవారం సభలో ఏం జరిగింది?

శుక్రవారం మండలిలో మరోసారి గందరగోళం

Advertisement

శుక్రవారం అమరావతిలో జరుగుతున్న శాసన మండలిలో మరోసారి గందరగోళం నెలకొంది. ఈ ఉదయం సభ ప్రారంభం తర్వాత అధికార-విపక్ష సభ్యుల మాటల యుద్ధం చోటు చేసుకుంది. టీటీడీకి నెయ్యి సరఫరా వ్యవహారం, ఇందాపూర్ డెయిరీ, సీబీఐ చార్జ్ షీట్ లోని అంశాలపై సభలో చర్చించాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఛైర్మన్ మోషేన్‌రాజు తిరస్కరించారు.

ఆ సమయంలో వైసీపీ సభ్యులు వెంకన్న స్వామి ఫోటోలు పట్టుకుని ‘గోవిందా.. గోవిందా..’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. సభలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆయన తన ఇయర్ ఫోన్స్ విసిరి కొట్టారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ సభ్యులకు బుద్ధి లేదంటూ మంత్రి మండిపడ్డారు.

Advertisement

వెంకటేశ్వర‌స్వామి ఫోటోలతో సభలోకి వైసీపీ, అధికార పార్టీ అభ్యంతరం

దేవుని ఫొటోలతో సభలో రచ్చ చేయడం సరికాదని విపక్ష సభ్యులకు సూచన చేశారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగుతారా? అంటూ వైసీపీ సభ్యులపై ధ్వజమెత్తారు మంత్రి పయ్యావుల. వైసీపీవి ముమ్మాటికీ దుర్మార్గ చర్యలంటూ వర్ణించారు. కావాలనే హిందువుల విశ్వాసాలను వైసీపీ రెచ్చగొడుతోందని విమర్శించారు.

చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని, సాక్షాత్తూ వెంకటేశ్వరస్వామి ఫొటోలను సభకు తేవడంపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. చివరకు ఇరు పార్టీల సభ్యుల ఆందోళనల మధ్య మండలి సమావేశాలను వాయిదా వేశారు ఛైర్మన్. హెరిటేజ్-ఇందాపూర్ డెయిరీలు దేవుడి సొమ్ము దోచుకున్నాయని ఆరోపించారు ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ.

ALSO READ: సర్పంచ్‌లకు ఏపీ సర్కార్ తీపి కబురు.. నిధుల వినియోగానికి గ్రీన్ సిగ్నల్!

ఈ దోపిడీపై చర్చ జరగాల్సిందేనన్నారు. సభలో చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. హెరిటేజ్ పై మంత్రులు ఎందుకు మాట్లాడడం లేదన్నారు. మరోవైపు మండలి ఛైర్మన్ ఛాంబర్ వద్ద కూటమి సభ్యులు నిరసన తెలిపారు. మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో సభ్యులు ఆందోళనకు దిగారు. వైసీపీ సభ్యుల మహాపచారంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరోవైపు టీడీఎల్పీలో మంత్రి లోకేష్ నేతృత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీల ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. వెంకన్న స్వామికి సభలో అవమానం జరిగిందన్నారు. ఈ విషయంలో వైసీపీ సభ్యుల తీరును తీవ్రంగా పరిగణించాలన్నారు. దేవుడికి అపచారం జరిగిందని సమావేశం నుంచి పార్టీ హైకమాండ్ కు వివరించారు సోము వీర్రాజు. వెంకటేశ్వర స్వామి ఫొటోలను ప్లకార్డులుగా ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

చివరకు మీడియా పాయింట్ వద్ద కూటమి ఎమ్మెల్సీలు మాట్లాడారు. దేవుడి ఫోటోలు పట్టుకుని నిరసన తెలపడం అనైతికమన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. దేవుడి పట్ల వైసీపీకి ఏమాత్రం గౌరవం లేదని ఇవాళ చర్యలతో నిరూపితమైందన్నారు. అటు బీజేపీ ఎమ్మెల్సీ సోము కూడా మాట్లాడారు. ఇది ముమ్మాటికీ క్షమించరాని నేరమన్నారు. జగన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆ పార్టీ సభ్యులు ఈ విధంగా ప్రవర్తించి ఉంటారన్నారు.

 

 

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×