E-Paper
Advertisement

AP Congress New Chief : ఏపీ కాంగ్రెస్‌కు కొత్త ఛీఫ్..

AP Congress New Chief : ఏపీ కాంగ్రెస్‌కు కొత్త ఛీఫ్..
Advertisement

AP Congress New Chief : ఏపీలో ఉనికి కోల్పోయి అష్టకష్టాలు పడుతున్న కాంగ్రెస్‌కు కొత్త చీఫ్ వచ్చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గే …. పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టారు. అందులో భాగంగా ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్‌ను తప్పించి…. ఆయన స్థానంలో గిడుగు రుద్రరాజును నియమించారు. 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీతోపాటు… 34 మందితో కో ఆర్డినేషన్ కమిటీని అధిష్ఠానం నియమించింది. సీనియర్ నేత హర్షకుమార్‌కు కూడా పదవి లభించింది.

మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, పి.రాజేశ్‌లను కార్య నిర్వాహక అధ్యక్షులుగా నియమించారు. సీనియర్ నేత హర్షకుమార్‌ను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌ బాధ్యతలను అప్పగించింది. మరో సీనియర్ నేత తులసిరెడ్డిని… మీడియా, సోషల్ మీడియా కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు.

Advertisement

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రుద్రరాజుకు సౌమ్యుడిగా, వివాద రహితుడిగా పేరుంది. కాంగ్రెస్‌తో చిన్నప్పటి నుంచే అనుబంధం ఉన్న ఆయన…. పార్టీకి అత్యంత విధేయుడుగా ఉన్నారు. తనను ఏపీసీసీ చీఫ్‌గా నియమించడంపై రుద్రరాజు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానన్నారు. అందరినీ కలుపుకుని ముందుకెళ్తానని చెప్పారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×