E-Paper
Advertisement

Amaravati: ఏపీ ఇంధన సంక్షోభం.. చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన షర్మిల

Amaravati: ఏపీ ఇంధన సంక్షోభం.. చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన షర్మిల
Advertisement

Amaravati: ఏపీలో నెలకొన్న ఇంధన సంక్షోభంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఈ విషయంలో కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులను రక్షించే ప్రభుత్వమా? భక్షించే ప్రభుత్వమా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో ఆక్వా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఏపీ ఇంధన సంక్షోభం రెట్టింపు, పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన వినియోగదారులు

Advertisement

ఏపీలో నెలకున్న ఇంధన సంక్షోభంపై ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. రూ.500 డీజిల్ కోసం ఓ ఆక్వా రైతు పడిన ఆవేదనను అందులో ప్రస్తావించారు. కూటమి పాలనలో ఆక్వా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. వారి పాలిట శాపంగా మారిందని విమర్శించారు.

ఆయిల్ పై ఓ రైతు ఆక్రోశిస్తున్న ఓ వీడియో షేర్ చేశారు. కూటమి పాపం.. ఆక్వా రైతన్న పాలిట శాపం అంటూ ప్రస్తావించారు. ఇంధన సంక్షోభం వల్ల రొయ్య రైతులకు అంతులేని కష్టం వచ్చిందన్నారు. కంటికి రెప్పలా చూసుకొనే రొయ్య పిల్లలను బతికించేందుకు పెట్రోల్ బంకు దగ్గర రైతన్న పడిన ఆవేదనను గుర్తు చేశారు.

Advertisement

చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల

ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఏపీలోనే ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రంలో ఫ్యూయల్ కోసం ప్రజల పడిగాపులా? పెట్రోల్ బంకుల దగ్గర మల్ల యుద్ధాలా? రేషన్ విధానంలో పెట్రోల్, డీజిల్ పోయడమా? ఇదెక్కడ న్యాయమని ప్రశ్నించారు. సరిపడేంత ఇంధనం ఉంటే దాదాపు 3 వేల బంకుల్లో No Stock బోర్డులు ఎందుకున్నాయని ప్రశ్నలు మీద ప్రశ్నలు లేవనెత్తారు.

రాష్ట్ర ప్రజలపై కేంద్రానికున్న చిత్తశుద్ధి ఇదేనా? అందుకేనా మోదీజీకి మద్దతు ఇచ్చేది? అన్ని రంగాలపై ఇంధన సంక్షోభం తీవ్ర పరిణామాలు చూపిస్తుంటే, ఇంకా బీజేపీ భజన చేయడానికి సీఎం చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. ఏపీపై బీజేపీకి పట్టింపు లేదనడానికి ఇంధన సంక్షోభం ఒక నిదర్శనమని తేల్చేశారు. వదంతులు నమ్మొద్దని చెప్పే బదులు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు.

ALSO READ: ఏపీలో ఇంధన సంక్షోభం.. డీజిల్ కోసం కాళ్లు పట్టుకుని బతిమిలాడిన ఆక్వా రైతు

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×