E-Paper
Advertisement

CM Chandrababu: కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. రెండు రోజుల షెడ్యూల్ ఇదే

CM Chandrababu: కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. రెండు రోజుల షెడ్యూల్ ఇదే
Advertisement

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇవాళ, రేపు కుప్పంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ద్రవిడ వర్సిటీ హెలిపాడ్‌ వద్ద ఆయన ల్యాండ్ అవుతారు. ద్రావిడవర్సిటీ ఆడిటోరియంలో.. స్వర్ణ కుప్పం విజన్-29 ఆవిష్కరణ.. చర్చా కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. గుడిపల్లి మండలం అగరం కొత్తపల్లిలో పర్యటించి.. మహిళలలో ముఖాముఖి నిర్వహించనున్నారు.

సాయంత్రం నడుమూరులో సౌర విద్యుత్‌ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొని.. ఆయన యువతలో ఇష్టాగోష్టి కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ఐదు గంటలకు కుప్పం మున్సిపాలిటీ శీగలపల్లెలో ప్రకృతి వ్యవసాయాన్ని సందర్శించి.. రైతులతో చర్చించనున్నారు. వీటితో పాటు పలు అభివృద్ధి పనుల్లోనూ సీఎం చంద్రబాబు పాల్గొంటారని అధికారులు వెల్లడించారు.

Advertisement

రాత్రికి ఆర్ అండ్ బి అతిథి గృహంలో బస చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు కుప్పం టీడీపీ కార్యాలయానికి చేరుకుంటారు. నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. అదే రోజు మధ్యాహ్నం కంగునూడి గ్రామంలో శ్యామన్న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. సాయంత్రం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. రాత్రికి కుప్పం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేయనున్నారు. 8వ తేదీ ఉదయం విశాఖపట్నం వెళ్లి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Also Read: మీకు భూమి ఉందా.. ఏపీ ప్రభుత్వ సరికొత్త నిర్ణయం మీకోసమే!

Advertisement

మరోవైపు కుప్పంలో రెండు దశల్లో విమానాశ్రయాన్ని నిర్మించనుంది. మొదటి దశలో 683 ఎకరాలు, రెండో దశలో 567 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించిన ఫీజిబిలిటీ నివేదికను అధికారులు సిద్ధం చేశారు. గన్నవరం విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ భవనాన్ని కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం ఆకారంలో నిర్మాణం జరగనుంది. విమానాశ్రయ విస్తరణ, కొత్త టెర్మినల్‌ భవన నిర్మాణ పనులను 6 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×