E-Paper
Advertisement

Chandrababu Serious on Minister wife Issue: పోలీసులపై మంత్రి భార్య దురుసు ప్రవర్తన.. చంద్రబాబు సీరియస్

Chandrababu Serious on Minister wife Issue: పోలీసులపై మంత్రి భార్య దురుసు ప్రవర్తన.. చంద్రబాబు సీరియస్
Advertisement

CM Chandrababu Serious on Minister wife Issue: ఆమె.. రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి సతీమణి. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ విషయం సీఎం వరకు చేరింది. వెంటనే స్పందించిన సీఎం అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ సదరు మంత్రికి సూచించారు. దీంతో ఆయన ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇతర మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం..

ఏపీ రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సతీమణి హరితారెడ్డి.. పోలీసులతో ప్రవర్తించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులతో ఆమె మాట్లాడిన విధానాన్ని తప్పుబట్టారు. మంత్రి రామ్ ప్రసాద్ తో ఫోన్ లో మాట్లాడి ఈ అంశంపై వివరణ ఇవ్వాలన్నారు. అధికారులు, ఉద్యోగుల పట్ల అందరూ గౌరవంగా ఉండాలంటూ సీఎం సూచించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే ఉపేక్షించబోమంటూ హెచ్చరించారు.

Advertisement

Also Read: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. పోలీసుల విచారణ, త్వరలో అరెస్టులు!

పోలీసుల పట్ల తన భార్య ప్రవర్తనపై మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి పొరపాట్లు మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. రాయచోటీలో పోలీసులు తనకు కూడా ఎస్కార్ట్ గా రావాలంటూ హరితారెడ్డి వారితో వాగ్వాదానికి దిగారంటూ ఆ వార్తా కథనాల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో వారితో దురుసుగా ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×