// // Online Fraud Alert: మయన్మార్ సైబర్ నరకం నుంచి 120 మంది ఏపీ యువకుల రక్షణ: సీఐడీ ఆపరేషన్ సక్సెస్! -->
E-Paper
Advertisement

Online Fraud Alert: మయన్మార్ సైబర్ నరకం నుంచి 120 మంది ఏపీ యువకుల రక్షణ: సీఐడీ ఆపరేషన్ సక్సెస్!

Online Fraud Alert: మయన్మార్ సైబర్ నరకం నుంచి 120 మంది ఏపీ యువకుల రక్షణ: సీఐడీ ఆపరేషన్ సక్సెస్!
Advertisement

Online Fraud Alert:మయన్మార్‌లోని సైబర్ నేరాల కూపాల నుంచి సుమారు 120 మంది ఆంధ్రప్రదేశ్ యువకులను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) సహాయంతో ఏపీ సీఐడీ విజయవంతంగా రక్షించింది. మయన్మార్‌లోని మయావాడి ప్రాంతం, అపఖ్యాతి పాలైన కేకే పార్క్ (K K Park) సైబర్ క్రైమ్ క్యాంప్ నుంచి 120 మందిని భారత్‌కు తీసుకువచ్చారు. జనవరి 2026లో మరో 22 మంది బాధితులను రక్షించారు. నవంబర్ – డిసెంబర్ 2025లో 79 మందిని స్వదేశానికి రప్పించారు.

ఎలా మోసం చేస్తున్నారు?

సీఐడీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఏ. రవిశంకర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కాంబోడియా, మయన్మార్, లావోస్ దేశాల కేంద్రంగా అంతర్జాతీయ ముఠాలు ఈ నెట్‌వర్క్ నడుపుతున్నాయి. సోషల్ మీడియాలో ఐటీ, డేటా ఎంట్రీ, డిజిటల్ మార్కెటింగ్‌లో భారీ జీతాలు ఇస్తామని ఆశ చూపుతారు.అక్కడికి వెళ్లిన వెంటనే పాస్‌పోర్టులు లాక్కుని, వారిని నేరగాళ్ల స్థావరాలకు తరలిస్తారు.బాధితులను క్రిప్టోకరెన్సీ స్కామ్‌లు, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్, రొమాన్స్ స్కామ్‌లు చేయాలని బలవంతం చేస్తారు. టార్గెట్లు రీచ్ అవ్వకపోతే కఠినంగా శిక్షిస్తారు.

ఏపీ సీఐడీ కఠిన చర్యలు

Advertisement

ఈ వ్యవహారంలో ఏపీ సీఐడీ ఇప్పటికే ఉక్కుపాదం మోపింది. ఐపీసీ, బీఎన్ఎస్, ఐటీ చట్టాల కింద ఇప్పటివరకు 15 కేసులు నమోదయ్యాయి. మోసాలకు పాల్పడుతున్న 30 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాల్లో ఉండి ఈ రాకెట్‌ను నడుపుతున్న మరికొందరిపై లుకౌట్ సర్క్యులర్లు జారీ చేశారు.

విదేశీ ఉద్యోగాల కోసం వెళ్లేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

విదేశాల్లో హై-పెయింగ్ సాఫ్ట్‌వేర్ లేదా డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న హ్యూమన్ ట్రాఫికింగ్ (మానవ అక్రమ రవాణా) నుండి రక్షణ పొందడానికి ఏపీ సీఐడీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) సూచనలు చేశాయి.

Advertisement

రిక్రూట్‌మెంట్ ఏజెంట్ తప్పనిసరిగా MEA వద్ద రిజిస్టర్ అయి ఉండాలి. eMigrate పోర్టల్‌లో ఏజెంట్ లైసెన్స్ నంబర్‌ను వెరిఫై చేయండి. ఉద్యోగం కోసం వెళ్లేవారు ఖచ్చితంగా ‘Work Visa’ పైనే వెళ్లాలి. ఏజెంట్లు మిమ్మల్ని ‘Tourist Visa’ పై రమ్మంటున్నారంటే అది 99% మోసమే అని గ్రహించాలి. కంపెనీ వెబ్‌సైట్, ఈమెయిల్ అడ్రస్ (Gmail/Yahoo కాకుండా కంపెనీ డొమైన్ ఉండాలి). ఆ దేశంలోని భారతీయ ఎంబసీ ద్వారా ఆఫర్ లెటర్ వాస్తవికతను సరిచూసుకోండి. థాయిలాండ్, మయన్మార్, కాంబోడియా, లావోస్ వంటి దేశాల్లో ఐటీ ఉద్యోగాల పేరుతో పిలుస్తున్నారంటే అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మయన్మార్ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లడం ప్రమాదకరం.విదేశాలకు వెళ్లేముందు మీ ప్రయాణ వివరాలు, ఏజెంట్ వివరాలు వెళ్తున్న కంపెనీ అడ్రస్‌ను కుటుంబ సభ్యులకు, వీలైతే స్థానిక పోలీసులకు తెలియజేయండి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×