E-Paper
Advertisement

Sujana Chowdary: ఆసుపత్రిలో ఎమ్మెల్యే సుజనా చౌదరి.. డాక్టర్లు ఏమన్నారు?

Sujana Chowdary: ఆసుపత్రిలో ఎమ్మెల్యే సుజనా చౌదరి.. డాక్టర్లు ఏమన్నారు?
Advertisement

Sujana Chowdary: ఏపీ బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సుజనాచౌదరి గాయపడినట్టు తెలుస్తోంది. లండన్ పర్యటనలో ఉన్న ఆయన, బాత్‌రూమ్‌లో జారిపడినట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన కుడి చేయి విరిగినట్టు సమాచారం. వెంటనే లండన్‌లో ప్రాథమిక చికిత్స చేశారు. అక్కడి నుంచి మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

అసలేం జరిగింది?

Advertisement

ఏపీ బీజేపీ ఎమ్మెల్యే సుజనాచౌదరి గాయపడినట్టు తెలుస్తోంది. లండన్ పర్యటనలో ఉన్న ఆయన బాత్‌రూమ్ జారిపడినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ క్రమంలో ఆయన కుడి చేయి విరిగినట్టు సమాచారం. వెంటనే లండన్‌లో ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు. అక్కడి నుంచి మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనను చూసిన కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని బయటపెట్టారు.

సర్జరీ కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఆయన చేరారు. ప్రస్తుతం బేగంపేట్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా ఆసుపత్రి వర్గాల మాట.  విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు.

Advertisement

పార్టీ శ్రేణుల ఆందోళన

సుజనకు గాయం విషయం తెలియగానే పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయాలని కోరుతున్నారు. సుజనా అభిమానులు కొందరు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్టు తెలుస్తోంది.

ALSO READ: పిట్ట కథలొద్దు.. లిక్కర్ స్కామ్ నిధులు విదేశాలకు

ఆపరేషన్ జరగాలంటే కనీసం 12 గంటలు పడుతుందని అంటున్నారు. పరీక్షలు నిర్వహించి తర్వాత ఆపరేషన్ జరగవచ్చని అంటున్నారు. ఈ లెక్కన రాత్రికి ఆపరేషన్ జరగడం ఖాయమని వార్తలు లేకపోలేదు.  దీనిపై అడిగితే తమకు తెలీదని అంటున్నారు కొందరు బీజేపీ నేతలు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×