E-Paper
Advertisement

Andhra Pradesh : ఏపీలో సమ్మెల పర్వం.. ప్రభుత్వానికి 108,104 సిబ్బంది సమ్మె నోటీసు..

Andhra Pradesh : ఏపీలో సమ్మెల పర్వం.. ప్రభుత్వానికి 108,104 సిబ్బంది సమ్మె నోటీసు..
Advertisement
Andhra Pradesh today news

Andhra Pradesh today news :

అమరావతిలో 108, 104 సిబ్బంది 23వ తేదీ నుండి సమ్మెకు వెళ్లనున్నారు. ఇప్పటికే అంగన్వాడీలు, మునిసిపల్ కార్మికులు, SSA సిబ్బంది సమ్మె చేస్తున్నారు. సోమవారం ప్రభుత్వానికి 108, 104 సిబ్బంది సమ్మె నోటీస్ ఇస్తున్నారు. ప్రధాన డిమాండ్ గా అప్కాస్ లో తమను తీసుకోవాలని కోరారు. ఆర్థిక పరమైన అంశాలపై కాకుండా డిపార్ట్మెంట్ అంశాలపై సమ్మె చేయనున్నారు. 104కి హెల్త్ సెంటర్ ను అప్పగించడం ద్వారా సంవత్సరానికి 100 కోట్లు ఆదా అవుతుందని సిబ్బంది చెబుతుంది. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గా ఈఎంటీ పోస్టులలో 108 సిబ్బందిని తీసుకోవాలి. 108, 104 లో 18 ఏళ్లుగా పని చేస్తున్న వాళ్ళను RTC కాంట్రాక్టు డైవర్స్ గా తీసుకోవాలని డిమాండ్ చేయనున్నారు.

Advertisement

గత కొద్ది రోజులుగా అంగన్ వాడీ వర్కర్ల కనీస వేతనం 26 వేలు చేయాలని, రిటైర్మెంట్ వయస్సు పరిమితిని 62 సంవత్సరాల వరకు పెంచాలని, అంగన్ వాడీ ఆయాలను టీచర్లుగా ప్రమోట్ చేయాలని, అంగన్ వాడీ వర్కర్లు అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న డిమాండ్లతో సమ్మె చేస్తున్నారు .

తర్వాత మున్సిపల్ కార్మికుల కూడా తమ డిమాండ్లను నేరవేర్చలని సమ్మె మొదలు పెట్టారు. పొరుగుసేవలు, పార్ట్‌టైమ్‌ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, మినిమం టైం స్కేల్‌ అమలు చేయాలని, ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులు కూడా నిరవధిక సమ్మె చేస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×