E-Paper
Advertisement

Annamayya District: బీర్లు తాగిన కొద్దిసేపటికే ప్రాణాలు పోయాయి.. అన్నమయ్య జిల్లాలో ఇద్దరు యువకుల అనుమానాస్పద మృతి!

Annamayya District: బీర్లు తాగిన కొద్దిసేపటికే ప్రాణాలు పోయాయి.. అన్నమయ్య జిల్లాలో ఇద్దరు యువకుల అనుమానాస్పద మృతి!
Advertisement

Annamayya District: అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బండ వడ్డీపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మద్యం సేవించిన కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపుతోంది.

పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల‌ ప్ర‌కారం.. మృతులను మణికుమార్ (36), పుష్పరాజ్ (28)గా గుర్తించారు. నిన్న రాత్రి ఆరుగురు యువకులు కలిసి కేవీ పల్లిలోని ఒక మద్యం షాపులో 16 బీర్లు కొనుగోలు చేశారు. అందరూ కలిసి మద్యం సేవించిన కాసేపటికే వారిలో అస్వస్థత మొదలైంది.పరిస్థితి విషమించడంతో వారిని వెంటనే పీలేరు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, ఆసుపత్రికి చేరుకునేలోపే మణికుమార్, పుష్పరాజ్ మరణించారు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు.

Advertisement

ఈ అనుమానాస్పద మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఆరుగురు వ్యక్తులు 16 బీర్లు సేవించడం వల్ల ‘ఆల్కహాల్ ఓవర్ డోస్’ అయ్యిందా?.. మద్యం షాపులో విక్రయించిన మద్యం ఏమైనా కల్తీ జరిగిందా? గడువు ముగిసిన (Expired) మద్యం సేవించడం వల్ల విషతుల్యంగా మారిందా? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రిపోర్టు వస్తేనే మరణానికి గల అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

ప్రస్తుతం మరణించిన యువకులు తాగిన మద్యం షాపు నుంచి శాంపిళ్లను సేకరించి పోలీసులు ల్యాబ్‌కు పంపారు. గతంలోనే అన్నమయ్య జిల్లాలో రూ. 1.75 కోట్ల విలువైన నకిలీ మద్యం తయారీ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు బెల్ట్ షాపుల్లో లేదా అనుమతి లేని చోట్ల మద్యం కొనుగోలు చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Read Also: ఫిలింనగర్‌లో కారు బీభత్సం: పల్టీలు కొట్టిన వాహనం.. ప్రాణభయంతో ప్రయాణికుల పరుగులు!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×