E-Paper
Advertisement

America: ఘోర రోడ్డు ప్రమాదం.. అమెరికా తెలుగు యువతి మృతి, అసలు ఘటన ఎలా జరిగింది?

America: ఘోర రోడ్డు ప్రమాదం.. అమెరికా  తెలుగు యువతి మృతి, అసలు ఘటన ఎలా జరిగింది?
Advertisement

America: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువతి జీవితం రోడ్డు ప్రమాదంలో అర్ధాంతరంగా ముగిసిపోయింది. వీకెండ్‌లో ఫ్రెండ్స్ తో కలిసి ప్రసన్న సమీపంలోని దేవాలయానికి వెళ్లారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద  ప్రసన్న కారుని అతివేగంతో వస్తున్న మరో వాహనం ఢీ కొట్టింది. ప్రసన్నతోపాటు మరో యువతి అక్కడే మృతి చెందారు.

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం-అమెరికాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు విద్యార్థిని మృతి చెందింది. కూతురు మృతి చెందిన విషయం తెలియగానే యువతి తల్లిదండ్రులు షాకయ్యారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందినది అట్లూరి ప్రసన్న. రైతు వసంత రావు-మల్లీశ్వరిల కుమార్తె ప్రసన్న. ఆ గ్రామంలో సంచుల తయారీ యూనిట్‌ను నడుపుతోంది.

Advertisement

తెలుగు యువతి ప్రసన్న మృతి- ఈ దంపతులు తమ కుమార్తెను ఉన్నత చదువుల కోసం అమెరికాకు పంపారు. ఇండియాలో చార్టర్డ్ అకౌంటెంట్ పూర్తి చేసిన ప్రసన్న, ఉన్నత చదువుల కోసం న్యూయార్క్‌కు వెళ్లింది. అక్కడ పేస్ యూనివర్సిటీ నుండి పోస్టు గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకుంది. ఇటీవలే తన కోర్సు పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతుండగా అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఈ లోకాన్ని విడిచిపెట్టింది.

ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రసన్న-జూలై 5న న్యూయార్క్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించింది. ప్రసన్న కుటుంబం చెప్పిన వివరాల మేరకు వీకెండ్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి సమీపంలోని గుడికి వెళ్లింది ప్రసన్న. దర్శనం తర్వాత ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వారి కారును అతివేగంతో వస్తున్న మరో వాహనం ఢీ కొట్టినట్లు చెప్పారు.

Advertisement

గుడిలో దర్శనం తర్వాత ప్రసన్న కారు ప్రమాదం-ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే ప్రసన్నతోపాటు మరో యువతి అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కూతురు మరణ వార్త తెలియడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు. ప్రసన్న ఆకస్మిక మరణం ఆమె కుటుంబాన్ని, బంధువులను  తీవ్ర దుఃఖంలో ముంచేసింది.

ALSO READ: కాణిపాకం హుండీలో కాసుల వర్షం.. 22 రోజుల్లో పోటెత్తిన విరాళాలు.. లెక్కలు చూస్తే షాకే!

ప్రసన్న తమ్ముడు ధనుంజయ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రసన్న పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించి స్వగ్రామానికి తీసుకురావడానికి సహాయం చేయాలని మృతురాలి కుటుంబం సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×