E-Paper
Advertisement

విశాఖకు మహార్థశ.. ఐటీఐ క్లస్టర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్, పీఎం సేతు అమలులో ఏపీ టాప్

విశాఖకు మహార్థశ..  ఐటీఐ క్లస్టర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్, పీఎం సేతు అమలులో ఏపీ టాప్
Advertisement

Delhi: విశాఖ సిటీ రూపు రేఖలు మారిపోతున్నాయి. తాజాగా ఐటీఐ క్లస్టర్‌కు స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌‌కు ఆమోదం తెలిపింది కేంద్రప్రభుత్వం. ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ భాగస్వామ్యంతో ఆధునీకరణ పనులు చేపట్టనుంది. అంతేకాదు ఏపీ అరుదైన ఘనత సాధించింది కూడా. దేశంలో పీఎం సేతు పథకం అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది.

విశాఖకు మహార్థశ.. ఐటీఐ క్లస్టర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Advertisement

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది ప్రధాన మంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్‌ఫర్మేషన్ త్రూ అప్‌గ్రేడెడ్ ఐటీఐస్- పీఎం సేతు. ఈ పథకం అమలులో దేశంలో తొలి రాష్ట్రంగా నిలిచింది ఆంధ్రప్రదేశ్. ఈ పథకం కింద విశాఖ ఐటీఐ క్లస్టర్‌కు సంబంధించిన వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.

దేశంలో పీఎం-సేతు కింద ఆమోదం పొందిన తొలి ప్రాజెక్టు ఇదే. జాతీయ స్థాయిలో రూ.60 వేల కోట్లతో చేపడుతున్న కార్యక్రమం ఇది. విశాఖ ఐటీఐల అభివృద్ధికి ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా, న్యూ ఏజ్ మేకర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- NAMTECHతో కలిసి ఈ ప్రాజెక్టును అమలు చేయనుంది. ఈ ప్రాజెక్టులో హబ్ అండ్ స్పోక్ మోడల్‌ను అమలు చేయనుంది.

Advertisement

పీఎం సేతు అమలులో ఏపీ టాప్

ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఐటీఐ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక శిక్షణ అందించడం ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం. కోర్సు పూర్తి చేసిన వెంటనే విద్యార్థులకు పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ప్రభుత్వ ఐటీఐలను బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించారు అధికారులు.

ఏపీ బాటలో మరో 12 రాష్ట్రాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పరిశ్రమల భాగస్వామ్యానికి టెండర్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా 1,000 ప్రభుత్వ ఐటీఐలను ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 60 వేల కోట్ల ఈ పథకాన్ని ప్రారంభించింది.

ALSO READ: డీఎస్సీ లీకేజీకి ఛాన్స్ లేదు.. తేల్చిచెప్పిన ఏపీ విద్యాశాఖ

శనివారం న్యూఢిల్లీలోని కౌశల్ భవన్‌లో జరిగిన జాతీయ స్టీరింగ్ కమిటీ మూడో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. నైపుణ్యాభివృద్ధి- వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబాశ్రీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. దీనికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ సీనియర్ అధికారులు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పారిశ్రామిక సంస్థలు-ఆసియా అభివృద్ధి బ్యాంకు, ప్రపంచ బ్యాంకుతో సహా అభివృద్ధి భాగస్వాముల ప్రతినిధులు హాజరయ్యారు. పీఎం-సేతు పథకం కింద ఇండస్ట్రీ పార్టనర్‌ను చేర్చుకున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలచింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×